‘ఆదిపురుష్’ పై ఆ రూమర్ ఎందుకొచ్చిందంటే…?

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియన్ ప్రాజెక్ర్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ చిత్రాన్ని ప్రకటించాడు. 3-డీ లో విజువల్ వండర్ గా రూపొందనున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని ఓ టాక్ నడుస్తోంది. టైటిల్ పోస్టర్ కూడా ‘ఆదిపురుష్’ ఇలా ఉండబోతోందని హింట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ‘ఆది పురుష్’లో ప్రభాస్ ని ఢీకొట్టే ప్రతినాయకుడు గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా ‘ఆది పురుష్’లో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడనే వార్తలు రూమర్స్ మాత్రనే అని తెలుస్తోంది. సైఫ్ నేమ్ తెరపైకి రావడానికి ప్రధాన కారణం.. గతంలో సైఫ్ ‘ఆది పురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి వర్క్ చేయడమే. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తానాజీ’ అనే సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అందువల్ల ఇప్పుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ సినిమాలో కూడా సైఫ్ విలన్ రోల్ పోషించబోతున్నాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. అయితే భారీ స్థాయిలో రూపొందనున్న ‘ఆదిపురుష్’ మూవీలో ఓ స్టార్ హీరో విలన్ గా నటించే అవకాశాలున్నాయని బీ-టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీని తెలుగు హిందీ భాషల్లో నిర్మించి తమిళం – మలయాళం – కన్నడ భాషలలో పాటు అనేక విదేశీ భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది.