బాలీవుడ్ వరస్ట్ మూవీలో నటవారసురాలు

0

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో రిలీజైన వరస్ట్ మూవీగా సడక్ 2 రికార్డులకెక్కింది. ఇక నెపోటిజం స్టార్లు ఆలియా- ఆదిత్యారాయ్ కపూర్ ఈ సినిమాలో నటించగా.. మహేష్ భట్ దర్శకత్వం వహించడంతో సుశాంత్ సింగ్ అభిమానులు సోషల్ మీడియాల్లో తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఈ మూవీపై జోకులు.. మీమ్స్ తో హీటెక్కిస్తున్నారు.

ఇంతకుముందు ట్రైలర్ రిలీజైనప్పుడు యూట్యూబ్ లో డిస్ లైక్స్ పరంగా రికార్డు సృష్టించిన సడక్ 2 పరమ చెత్త సినిమాల జాబితాలో చేరిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం (28 ఆగస్టు) మిడ్ నైట్ డిస్నీ స్టార్ లో రిలీజైన ఈ సినిమాని క్రిటిక్స్ ఓ రేంజులో విమర్శించారు.

ఏదో సుశాంత్ సింగ్ అభిమానులు మాత్రమే తిట్టేయడం కామన్ అని అనుకుంటే సామాన్యులకు సైతం నచ్చే కంటెంట్ లేదన్న రివ్యూలు వచ్చాయి. ఆలియా తండ్రి మహేష్ భట్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి దర్శకత్వం వహిస్తుండడంతో సడక్ 2 పై భారీ అంచనాలేర్పడ్డాయి. కానీ ఆ అంచనాలన్నిటినీ మూవీ తుస్సుమనిపించేసింది. 2020లోనే వరస్ట్ మూవీగా ఇది రికార్డుల్లో నిలిచిపోనుంది.

ఇక ఓటీటీలో తదుపరి గుంజన్ సక్సేనా- ది కార్గిల్ గర్ల్ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే రిలీజైన బాలన్ శకుంతలాదేవి మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందింది. సడక్ 2 పాటలు ట్రైలర్ సహా సినిమా కూడా మెప్పించలేకపోవడం విచారకరం. ఇక క్రిటిక్స్ ఈ మూవీకి జీరో రేటింగ్ ఇచ్చారు. తరణ్ ఆదర్శ్ అయితే కేవలం 1/5 రేటింగ్ ఇవ్వడం షాక్ కి గురి చేస్తోంది. ఈ చిత్రంలో ఆలియాభట్- సంజయ్ దత్ – ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు నటించారు.