కరోనా సోకిందనే వార్తలకు చెక్ పెట్టిన మెగా హీరో…!

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా సోకిందంటూ ఈ రోజు ఉదయం నుంచి ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డబ్బింగ్ కార్యక్రమం వాయిదా పడిందని.. ప్రస్తుతం తేజ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ రావడంతో ఇవన్నీ రూమర్స్ అని నిరూపిస్తూ సాయి ధరమ్ తేజ్ టీమ్ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫొటోతో తేజ్ అనారోగ్యంగా లేడని పరోక్షంగా చెప్తూ.. తేజ్ సినిమా వర్క్ తో బిజీగా ఉన్నాడని తెలిసేలా చేసింది. దీంతో మెగా మేనల్లుడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది.

సాయి ధరమ్ తేజ్ ‘ప్రస్థానం’ దేవా కట్టాతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రీకరణ పూర్తి చేసిన తేజ్.. దేవాకట్టా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్ తో డిస్కషన్ చేస్తూ తేజ్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటో కూడా తేజ్ – దేవా కట్టా చర్చలు జరుపుతున్నట్లు తెలియజేస్తోంది. తేజ్ కెరీర్ లో 14వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మూడో వారంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ మెగా మేనల్లుడిని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. దసరా కానుకగా పే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి ప్లాన్స్ జరుగుతున్నట్లు ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు.