ఈ పురుగు మెగా హీరోలకు స్ఫూర్తి.. మరి మీకో?

0

“ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ విజయానికి దారి ఉంటుంది“ .. ఇదీ మెగా హీరో సాయి తేజ్ క్యాప్షన్. ఆ శీర్షికకు అర్హమైన వీడియోనే షేర్ చేశాడు అతడు. ఆ పురుగు మనోబలం ధీక్ష నిజంగానే అబ్బుర పరుస్తున్నాయి. ప్రయత్నిస్తే అందనిది ఏది? అని జాబ్ లెస్ యూత్ ని .. అపజయం గురించి కలత చెందేవారిని ప్రశ్నిస్తున్నట్టే ఉంది మరి. ఆ చిన్న పురుగు ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.

ఎక్కడి నంచి వచ్చిందో ఆ అంగుళం పురుగు దాని లక్ష్యం చేరేవరకూ విడిచిపెట్టలేదు. ఒక బల్ల పై నుంచి ఇంకో బల్ల పైకి పాకిరే క్రమంలో అసలు దానికి అసాధ్యం అనుకుంటే అది పొరపాటే అని నిరూపించి శహభాష్ అనిపించింది. ఒక పర్వతం పై నుంచి లోయ మీదుగా ఇంకో పర్వతం మీదికి దూకినంత సాహసమే చేసింది మరి. జుత్తు అందకపోతే ఎలా దొరకబుచ్చుకోవాలో పాఠం నేర్పించింది. అసలే లాక్ డౌన్ లో ఉద్యోగాలు కోల్పోయి.. బతుకు తెరువు ఎలా అని కలత చెందిన నిరుద్యోగ యువతకు ఇది నిజంగా స్ఫూర్తి నిచ్చేదే. వండర్స్ ఆఫ్ సైన్స్ ట్విట్టర్ వీడియో ఇది.

దీనికి మెగా ఫ్యాన్స్ స్పందన అద్భుతం. “మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కెరీర్ లో ఎదిగేందుకు ఇది ప్రధాన కారణం“ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మంచి విషయాలను ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు అని మరో నెటిజన్ స్పందించారు.

ఆ పురుగు నుంచి నేర్చుకున్నాడో ఏమో కానీ సాయితేజ్ ఇటీవల వరుస పరాజయాల నుంచి బయటపడి విజేతగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిత్రలహరి – ప్రతిరోజూ పండగే చిత్రాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ అంతకుముందు ఆ పురుగులానే విశ్వ ప్రయత్నం చేశాడు సుమీ. ఓపిగ్గా వేచి చూసినందుకు ఫలితం దక్కించుకున్నాడు. తదుపరి సోలో బ్రతుకే సో బెటరూ రిలీజ్ కానుంది. దేవాకట్టా.. కార్తీక్ దండు (సుక్కు శిష్యుడు)లతో తదుపరి సినిమాల్ని చేయనున్నాడు.