బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ షో

0

మోడల్ గా నటిగా సుపరిచితం అయిన సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ లో హీట్ పెంచుతున్నాయి. ఈ అమ్మడు ఒంటి విరుపులతో కుర్రాళ్ల గుండెలను కోస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు అందాల ప్రదర్శణ ఉందంటున్నారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో హడావుడి చేసిన సాక్షి అగర్వాల్ సినిమాలతో బిజీ అయ్యింది. గత ఏడాది విశ్వాసం సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

తమిళం మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఈ ఫొటోలు కనుక చూస్తే ఖచ్చితంగా అమ్మడికి ఆఫర్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తారేమో అంటున్నారు. ఈమెను నెట్టింట చూసిన ప్రేక్షకులు తెలుగులో వెండి తెరపై ఈమెను చూడాలనుకుంటున్నారు. సినిమాలతో పాటు ఎన్నో బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపించిన సాక్షి అగర్వాల్ మోడలింగ్ లో కూడా కెరీర్ ఆరంభంలో రాణించింది.