సమంతకు అందనంత దూరంలో ఉన్న కాజల్

0

సౌత్ లో పుష్కర కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటారు. సౌత్ లో ఉన్న హీరోయిన్స్ అందరిలోకి కాజల్ అగర్వాల్ ఫాలోవర్స్ సంఖ్య అత్యధికం. ఈ విషయంపై ఆమె అభిమానులు చాలా గర్వంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సమంత తర్వాత స్థానంలో ఉంది. సమంతకు మరియు కాజల్ కు మద్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ట్విట్టర్ ఫేస్ బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నింట కలిపి కాజల్ కు ఏకంగా 42 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ లోని కొందరు స్టార్ హీరోయిన్స్ కు కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేరు. కాజల్ అభిమానులు ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాజల్ అగర్వాల్ మొత్తం ఫాలోవర్స్ సంఖ్య 42 మిలియన్స్ కాగా సమంత ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 28.5 మిలియన్ లు గా ఉంది. రెండవ స్థానంలో ఉన్న సమంత కంటే కాజల్ ఫాలోవర్స్ విషయంలో చాలా దూరంలో ఉంది. ఇక మూడవ స్థానంలో రకుల్ ప్రీత్ ఉంది. ఈమెకు సమంత కంటే ఒక్క మిలియన్ తక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అనుష్క ఉండగా ఈమెకు రకుల్ కంటే పది మిలియన్ ల మంది తక్కువగా ఉన్నారు. 17.6 మిలియన్ ల ఫాలోవర్స్ ఈమెకు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తమన్నా 15.9 మిలియన్ ల ఫాలోవర్స్.. ఇలియానా 15.5 మిలియన్ ల ఫాలోవర్స్ ను.. కీర్తి సురేష్ 15 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇంత కాలం హీరోల ఫాలోవర్స్ గురించి మాత్రమే చర్చ జరిగేది. ఇప్పుడు హీరోయిన్స్ సోషల్ మీడియా రికార్డులు మొదలు అయ్యాయి. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.