Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆదిపురుష్ స్పెషల్ ట్రైనింగ్ ఏ విద్యలో?

ఆదిపురుష్ స్పెషల్ ట్రైనింగ్ ఏ విద్యలో?


వరుస సినిమాలతో ఒక్కసారిగా హీట్ పెంచేశాడు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా రాధే శ్యామ్ చిత్రీకరణ ముగింపులో ఉంది. క్రైసిస్ లేకపోతే ఈపాటికే రిలీజ్ కావాల్సినది. ఈలోగానే మరో రెండు సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. ఇవి రెండూ పాన్ వరల్డ్ రేంజ్. ముఖ్యంగా ఓం రౌత్ దర్శకత్వంలోని `ఆదిపురుష్ 3డి` ఎలాంటి సంచలనాలకు తెర తీయనుంది? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పాత్రకు ప్రభాస్ ని తప్ప వేరొకరిని ఊహించుకోలేను అంటూ ప్రకటించి ఒక్కసారిగా ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు.

అందుకు తగ్గట్టే డార్లింగ్ కి తన పాత్రకు ఉపయోగపడేలా స్పెషల్ ట్రైనింగ్ ని ప్లాన్ చేశాడట. అది ఏ తరహా శిక్షణ అంటే.. విలు విద్యలో ప్రభాస్ కి ప్రత్యేక తర్ఫీదును ఇప్పించనున్నారని తెలుస్తోంది. అందుకోసం థాయ్ ల్యాండ్ నుంచి నిపుణుడిని రప్పించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కత్తిసాము… కర్ర తిప్పడం.. నాన్ చాక్ .. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో ప్రభాస్ దిట్ట. ఇంతకుముందు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి కోసం ఇవన్నీ ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. అప్పటికే ఆయా విద్యల్లో రాటుదేలినా ఇంకా కావాల్సినంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు బాణం వేసే విద్యలోనూ రాటు దేలనున్నాడన్నమాట. ఈ శిక్షణతో ఒక విలుకాడు తన శరీరాన్ని ఎలా మార్చుకోవాలో కూడా నేర్పించనున్నారట.

ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభించే ముందు విస్తృతమైన శిక్షణా ప్రణాళికను రూపొందించనున్నారు. 2021 ద్వితీయార్ధంలో షూటింగ్ ప్రారంభమవుతుందని.. 2022 లో విడుదలవుతుందని దర్శకుడు చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టులో కీర్తి సురేష్ సీత పాత్ర పోషిస్తారని… సైఫ్ అలీ ఖాన్ తో ప్రధాన విరోధి పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారని ఓం రౌత్ వెల్లడించారు. టి సిరీస్- రెట్రో ఫిల్స్ సంస్థలు నిర్మించనున్నాయి.