కంగనావి అసత్య ఆరోపణలు.. తన పద్మశ్రీని వెనక్కు ఇవ్వాలి..ఆదిత్య పంచోలి

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే సుశాంత్ మరణానికి బాలీవుడ్ లోని నెపోటిజమే కారణమని కంగనా రనౌత్ మొట్ట మొదట ఆరోపణలు చేసింది. కింది స్థాయి నుంచి వచ్చి స్టార్ డమ్ అందుకోవడం అందరికీ నచ్చలేదని.. అందుకే అతడు ఒంటరి వాడిననే ఫీలింగ్ తోనే గడిపే వాడని పేర్కొంది. కంగనా ఒకటికి రెండు సార్లు సుశాంత్ మరణంపై పలువురిపై విమర్శలు వ్యక్తం చేయడంతో.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని చాలా మంది నటులు ముఖ్యంగా సుశాంత్ అభిమానులు కంగనాకు మద్దతుగా నిలిచారు.

కాగా ఇటీవల సుశాంత్ తండ్రి పాట్నా లోని ఓ పోలీసు స్టేషన్ లో తన కుమారుడు మరణానికి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తే కారణమని ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నటుడు ఆదిత్య పంచోలి స్పందించారు. సుశాంత్ మరణానికి బాలీవుడ్ లోని నెపోటిజం కారణం కాదని.. సుశాంత్ మరణంపై ఆయన తండ్రి చేసిన ఫిర్యాదులో ఎక్కడా దీని గురించి లేదన్నారు. ఇన్నాళ్లు సుశాంత్ మరణానికి నెపోటిజం బంధు ప్రీతి కారణం అంటూ హడావుడి అసత్య ప్రచారం చేసిన కంగనా ప్రభుత్వం తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల కిందట కంగనా ప్రభుత్వం కరణ్ జోహార్ కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదిత్య పంచోలి కంగనా పై ఆరోపణలు చేశాడని అంతా అంటున్నారు.