ఎప్పుడూ వాళ్లనే కాపీ కొట్టకు అక్కినేని కోడలా!

0

అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలో ఎంత షార్ప్ గా ఉంటారో తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్లు తనకు కాస్ట్యూమ్స్ ని అందిస్తుంటారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఫ్యాషనిస్టాలు గా పేరున్న అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ వంటి వారిని సమంత అనుసరించడం చాలాసార్లు ఫ్యాన్స్ కనిపెట్టేశారు.

తాజాగా సోనమ్ ధరించిన ఓ డిజైనర్ చీరకట్టులో సమంత తళుకుబెళుకులు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాషన్ ఫేస్ ఆఫ్ అంటూ ఈఫోటోలకు కామెంట్లు పడిపోతున్నాయ్. సమంతా అక్కినేని లేదా సోనమ్ కపూర్ అహుజా.. వీళ్లలో గిరిజన బిజిలీ చీరను ఎవరు బాగా ధరించారు? అంటూ డిబేట్ పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. సమంతా అక్కినేని.. సోనమ్ కపూర్ అహుజా ఇద్దరూ ఎవరికి వారు తమ ప్రత్యేకమైన శైలితో దూసుకెళుతున్న వారే. కానీ ఎవరికి ఈ లుక్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అన్నది అభిమానులే చెప్పాలి.

2018 లో ఒక పండుగ సందర్భంగా సోనమ్ కపూర్ గులాబీ జాకెట్టు .. గిరిజన చెవిరింగులతో జత చేసిన మసాబా ప్రింటెడ్ చీర ధరించి కనిపించారు. ఆమె అద్భుతమైన ప్రదర్శన అందరి కళ్ళను ఆకర్షించింది. ఆ ప్రింటెడ్ చీరలో కుడి భుజంపై ఆమె పల్లూ ధరించి ట్విస్ట్ వచ్చింది.

మరోవైపు సమంతా అక్కినేని కూడా ఒక ఈవెంట్ కోసం అదే డిజైనర్ చీర ధరించి కనిపించారు. ఆమె దానిని వెండి ఆభరణాలతో యాక్సెస్ చేయడంతో ఉత్తమంగా స్టైలిష్ గా కనిపించింది. వదులు మోడల్ స్లీవ్స్ జాకెట్ ఆకట్టుకున్నాయి. అయితే అక్కినేని కోడలు ఇలా బాలీవుడ్ నాయికల్ని ఇమ్మిటేట్ చేస్తుంటే ఎలా? మరికాస్త అవేగా కొత్తగా కనిపిస్తే బావుంటుందేమో! అంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో కోరుతున్నారు.