ఆ కొంటె నవ్వుతోనే ఏదో మాయ చేసేస్తోంది!

0

అక్కినేని కోడలా మజాకానా?.. ఓవైపు సినిమాలు వెబ్ సిరీస్ ల కోసం కథలు వింటూనే మరోవైపు గెస్ట్ రైటర్ గా ఉపాసన వెబ్ సైట్ కి ఆర్టికల్స్ రాస్తూ బిజీగా ఉన్నారు సమంత. మరోవైపు హబ్బీ నాగచైతన్యకు సంబంధించిన డైలీ షెడ్యూల్ మానిటరింగ్ ఎలానూ ఉంటుంది. అయితే ఎన్ని పనులు ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా.. సమంత పర్ఫెక్ట్ ప్రణాళికతో ప్రతిదీ డిజైన్ చేస్తుండడం యువతరానికి స్ఫూర్తిని నింపుతోంది.

ఇటీవల కొంతకాలంగా ఉపాసన నిర్వహిస్తున్న యుఆర్ లైఫ్ వెబ్ కోసం అదిరిపోయే వంటకాలు సహా ఫిట్నెస్ టిప్స్ కి సంబంధించిన విషయాల్ని షేర్ చేసింది. పనిలో పనిగా వేడెక్కించే ఫోటోషూట్ తోనూ యుఆర్ లైఫ్ కి ట్రాఫిక్ పెంచేసింది కోడలు.

ఈ సిరీస్ లో ఇదిగో ఇదో లేటెస్ట్ ఫోటోషూట్. సామ్ అక్కినేని చీరలో ఎంతందంగా ఉంటుంది? తను నవ్వితే ఎంత గమ్మత్తైన ఫీల్ పుడుతుందో కనిపిస్తోంది కదూ? ఆ కొంటె నవ్వుతోనే ఏదో మాయ చేసేస్తోంది! అందుకేగా అక్కినేని బుల్లోడినే ముగ్గులోకి దించేయగలిగింది. చైతన్యతో ఎనిమిదేళ్ల స్నేహం ప్రేమగా మారి అటుపై పెళ్లి బంధంతో ఒకటైన సంగతి అభిమానులకు తెలిసినదే. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 దసరా నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అలాగే హబ్బీ నాగచైతన్య కూడా ఓ వెబ్ సిరీస్ కి అంగీకరించారని కథనాలొస్తున్న సంగతి తెలిసినదే.