ఇదే చివరిది.. ప్రామిస్…!

0

కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులకు ఫ్యామిలీతో గడపడానికి కావాల్సినంత సమయం దొరికింది. అయితే చాలా మంది హీరో హీరోయిన్లు మాత్రం షూటింగ్ లేదు కదా అని ఫిట్ నెస్ ని అశ్రద్ధ చేయలేదు. ఇంట్లోనే ఖాళీగా కూర్చొని తింటుంటే భారీగా శరీరం పెరిగిపోతుందని అలోచించి అందరూ సాధ్యమైనంతగా వర్కౌట్స్ చేసి శరీరాన్ని కష్టపెట్టారు. ముఖ్యంగా మన హీరోయిన్లు హోమ్ జిమ్ లో కష్టపడుతూ చెమటలు కక్కిస్తున్న వీడియోలను షేర్ చేసి.. అభిమానులను అలరిస్తూ వచ్చారు. ఇక అక్కినేని వారి కోడలు సమంత కూడా లాక్ డౌన్ లో జిమ్ చేయడంతో పాటు యోగా కూడా చేస్తూ వచ్చింది. ఆమె ఫిట్ నెస్ ఎలా ఉంటుందో ఆమె మైంటైన్ చేస్తున్న ఫిగర్ చూస్తే అర్థం అవుతుంది.

అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫిట్ నెస్ ని అశ్రద్ధ చేయకుండా వందల కేజీల బరువు తేలిగ్గా ఎత్తేస్తుంది. అయితే నేను జిమ్ చేసేది బాడీ షేప్ కోసం కాదని.. వర్కౌట్స్ చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుందని అంటుంది సామ్. ఇటీవల రెగ్యులర్ గా వర్కౌట్స్ ఫోటోలు వీడియోలు పోస్టు చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ మధ్య ఉపాసన కొణిదెల ప్రారంభించిన URLife.co.in వెబ్ సైట్ అతిథి సంపాదకురాలిగా ఎంపికైన సమంత.. రోజుకొక కొత్త ఫోటో అప్లోడ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో లేటెస్టుగా మరో పిక్ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది సమంత. డైలీ ఒక వర్కౌట్ ఫోటో పెడుతున్నాను.. ఇదే చివరిది అన్నట్టు దానికి ‘లాస్ట్ వన్.. ఐ ప్రామిస్’ అని క్యాప్షన్ పెట్టింది. దీనికి ఉపాసన మరియు ట్రైనర్ సందీప్ లను ట్యాగ్ చేసింది. ఇక నటన విషయానికొస్తే సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.