సింప్లిసిటీనే పటౌడీ వారసురాలి అలంకరణ

0

బాలీవుడ్ లో నటవారసురాలు సారా అలీఖాన్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్లతో బ్లాక్ బస్టర్లు అందుకుని కెరీర్ పరంగా దూసుకుపోతోంది సారా. సైఫ్ అలీఖాన్ – అమృత జంట కుమార్తెగా ఈ భామ ప్రతిభ పరంగా తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తోంది. ఇటీవలే వరుణ్ ధావన్ సరసన నటించిన కూలీనంబర్ 1 ఫ్లాపైనా సారా నటన.. డ్యాన్సులు గురించి ప్రత్యేకించి ముచ్చటించుకున్నారంటే అర్థం చేసుకోవాలి.

ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ పరంగానూ సారా ఆల్వేస్ హాట్ టాపిక్. ఈ భామ చాలాసార్లు తనదైన సింప్లిసిటీని చాటుకుని ప్రత్యేకంగా జనాల మైండ్ లో రిజిస్టర్ అయ్యింది. ఇంతకుముందు ఎయిర్ పోర్ట్ లో తన సూట్ కేస్ తానే మోస్తూ కనిపించి సర్ ప్రైజ్ చేసింది. తనతో పాటే పనివాళ్లు ఉన్నా పటౌడీ వారసురాలు వారికి ఆ పని అప్పజెప్పాల్సిన అవసరం లేకుండా తనే సూట్ కేస్ ని మోసి ఆశ్చర్యపరిచింది.

అలాగే సౌకర్యం శైలి తన ప్రత్యేకతలు. తాజాగా సారా లుక్ మరోసారి చర్చకు వచ్చింది. ముంబై విమానాశ్రయంలో వైట్ అండ్ ఎల్లో కలర్ షేడ్స్ లుక్ తో చాలా సింపుల్ గా కనిపించింది. కరోనావైరస్ రక్షణ కోసం ఆమె ముసుగు ధరించి కనిపించింది. ఫ్యాషన్ విషయంలో సారాకు ప్రత్యేకమైన శైలి ఉంది. రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ఎంత వైబ్రేంట్ గా కనిపిస్తుందో సహజ జీవనంలో ఉన్నప్పుడు అంతే సింపుల్ గా అలంకరణను ఇష్టపడుతుంది.

ఇటీవల న్యూఇయర్ సెలబ్రేషన్స్ నుంచి కొన్ని ఫోటోల్ని సారా షేర్ చేసింది. వాటిలో తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో తన సోదర అనుబంధానికి సంబంధించిన సంతోషకరమైన చిత్రాన్ని అభిమానులకు షేర్ చేసింది.

కెరీర్ సంగతి చూస్తే.. సారా అలీ ఖాన్ తదుపరి ‘అట్రాంగి రే’ లో కనిపిస్తుంది. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్- ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ లీక్ ప్రకారం.. ఈ చిత్రం స్క్రీన్ ప్లే బేస్డ్ లో థ్రిల్ చేస్తుందని తెలిసింది. సమాంతరంగా నడుస్తున్న వేర్వేరు కాలమానాల నుండి రెండు రొమాంటిక్ లవ్ స్టోరీల్ని ఇందులో చూపిస్తున్నారు. నాన్-లీనియర్ కథనం ఆద్యంతం స్పెల్ బౌండ్ చేస్తుందట. ఈ సంవత్సరంలోనే మూవీ విడుదల కానుంది.