తేనెలో తడిసి ముద్దయిన ఐటెమ్ భామ

0

బాహుబలి మనోహరి.. సాంగ్ లో ముగ్గురు భామల్లో ఒక ఐటెమ్ గాళ్ స్కార్లెట్ విల్సన్. నోరా ఫతేహి- గాబ్రియేలా బెర్ట్రాండే లతో కలిసి స్కార్లెట్ నర్తన హీట్ పుట్టించింది. అంతకుముందే ఈ భామ టాలీవుడ్ లో ఐటెమ్ గాళ్ గా సుపరిచితం.

ఈ విదేశీ ముద్దుగుమ్మ అందచందాలు నృత్య కదలికలకు ప్రత్యేకించి అభిమనులున్నారు. ఇక ప్రయోగాలు చేయడంలోనూ స్కార్లెట్ ఎప్పుడూ ముందుంటుందనడానికి తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోనే సాక్ష్యం. ఆయిలీ వెట్ లుక్.. లేదా తేనె లో తడిసి ముద్దువుతున్న స్కార్లెట్ తాజా ఫోటో కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది. జీనియస్ ఫోటోగ్రఫీ అంటూ ఆ ఫోటోషూట్ చేసిన వ్యక్తికి స్కార్లెట్ కితాబిచ్చేయడంతో మరింతగా చర్చకు తావిచ్చింది.

ఇక ఈ భామ స్వగతం పరిశీలిస్తే.. చాలా సంగతులే ఉన్నాయి. స్కార్లెట్ 9 మే 1989 న జన్మించింది. కెంట్ లోని ఫోక్స్ టన్ లో పెరిగింది. ఆమె తల్లి రోసలింద్ ఒక నర్తకి .. స్కార్లెట్ నడవగలిగే ఏజ్ లోనే డ్యాన్స్ వృత్తిని ప్రారంభించింది. అనంతరం బాల నటిగానూ కొనసాగింది. 13 సంవత్సరాల వయస్సులో స్టేజీ డ్రామాల్లో నటించింది. ఆమె కార్మెన్ అనే పాత్రలో నటిస్తే మంచి గుర్తింపు దక్కింది.

16 సంవత్సరాల వయస్సులో స్కార్లెట్ టిఫనీ థియేటర్ కాలేజీలో చదివింది. అక్కడ ఆమె 3 సంవత్సరాల పాటు ప్రదర్శన కళలలో వృత్తిపరంగా శిక్షణ పొందింది. కళాశాల తరువాత స్కార్లెట్ కు భారతదేశంలో మోడలింగ్ కాంట్రాక్ట్ అవకాశం దక్కింది. అటుపై టిబా రేగా దిబాకర్ బెనర్జీ `షాంఘై`లో తొలి హాలీవుడ్ ఆఫర్ దక్కింది. నటన మోడలింగ్ పరంగా భారతదేశం ఇంగ్లాండ్ లో బిజీ అయ్యింది.