‘తలా’ దర్శకుడు శివ ఇంట్లో విషాదం..జయ కుమార్ కన్నుమూత

0

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సిరుతై శివ తండ్రి ప్రముఖ నిర్మాత అయిన జయ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. శనివారం ఆయన మరణించారు. దీంతో దర్శకుడు శివ ఇంట్లో విషాదం నెలకొంది. జయకుమార్ పలు లఘు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. డాక్యుమెంటరీలకు ఫోటోగ్రాఫర్ గా కూడా పని చేసారు.

ఆయన ఏకంగా 400 షార్ట్ ఫిల్మ్స్ కోసం పని చేశారు. ఆయన పెద్ద కుమారుడు సిరుతై శివ ప్రస్తుతం తమిళంలో అగ్ర దర్శకుడిగా పేరు పొందాడు. తల అజిత్ తో వరుసగా వీరమ్ వేదాళం వివేగం విశ్వాసం చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ హీరోగా అన్నాత్తే అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో కూడా శివ గోపిచంద్ హీరోగా శంఖం శౌర్యం వంటి సినిమాలను తెరకెక్కించాడు.

జయ కుమార్ తండ్రి ఏకే వేలన్ కూడా తమిళంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. జయ కుమార్ పెద్ద కుమారుడు శివ కోలీవుడ్ లో దర్శకుడిగా రాణి స్తుండగా.. చిన్న కుమారుడు బాలా పలు మలయాళ సినిమాల్లో హీరోగా నటించాడు.కాగా జయకుమార్ మరణవార్త తెలుసుకుని తమిళ సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు ఇతర విభాగాలకు చెందిన వారు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.