శర్వా `మహా సముద్రం` సౌండ్ లేని బాంబులా!

0

ప్రతి నిశ్శబ్ధం వెనక ఒక సౌండ్ ఉంటుంది. వినేవాళ్లకే అది వినిపిస్తుంటుంది. ఇదిగో వీళ్లు కూడా అలానే సౌండ్ లేకుండా బాంబ్ పేల్చారు. శర్వానంద్ – అజయ్ భూపతి కాంబినేషన్ మూవీ `మహా సముద్రం` అధికారిక ప్రకటన ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీపై చాలా కాలంగా వార్తలు వస్తున్నా కన్ఫర్మేషన్ న్యూస్ అయితే లేదు. అసలు ఉంటుందా ఉండదా? అంటూ రకరకాల కథనాలు మీడియాలో వేడెక్కించాయి.

ఎట్టకేలకు అన్ని సందేహాలను క్లియర్ చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటనతో ముందుకు వచ్చారు. శర్వానంద్ `మహాసముద్రం` కన్ఫామ్ అయ్యింది. ఇదో డీప్ ఇంటెన్స్ లవ్ స్టోరితో కూడుకున్న యాక్షన్ డ్రామా అని చిత్రబృందం చెబుతోంది. స్క్రిప్టు పూర్తిగా రెడీ అయ్యింది. త్వరలోనే సెట్స్ కి వెళ్లనున్నారు.

ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. శర్వా సరసన కథానాయిక ఎవరు? అన్నది ప్రకటించాల్సి ఉంది. వెల్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ అందిస్తాం! అంటూ అజయ్ భూపతి టీమ్ ఉరకలెత్తుతోంది. మరి హిట్టు లేని శర్వాకి సరైన బ్లాక్ బస్టర్ ఇస్తారేమో చూడాలి. డీప్ ఇంటెన్స్ లవ్ స్టోరి అంటే ఏం కొత్తగా చూపిస్తారో అన్న ఆసక్తికి తగ్గట్టే అజయ్ భూపతి కొత్తగా తీస్తాడా? ఆర్.ఎక్స్ 100 ని మించిన డీప్ లవ్ స్టోరీనా? అన్నది చూడాలి.