హాట్ బ్యూటీ చిన్నప్పుడు స్టిల్స్ వైరల్

0

స్టార్ హీరోలు హీరోయిన్స్ ఫొటోలు ఏవైనా సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతాయి. అలాంటిది వారి చిన్నప్పటి ఫొటో అంటే ఖచ్చితంగా మరింతగా పాపులారిటీని దక్కించుకుంటాయి. ఎక్కువ మంది ఆ ఫొటోలు పట్టి పట్టి చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈమద్య కాలంలో స్టార్స్ తమ పాత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా శృతి హాసన్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాట్ బ్యూటీ చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

శృతి హాసన్ స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఆ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చెక్స్ షర్ట్ వేసుకుని మోకాళ్ల పై వరకు స్కర్ట్ వేసుకుని శృతి హాసన్ కింద కూర్చుని చిరు నవ్వులు చిందిస్తుంది. అప్పటి శృతి హాసన్ కు ఇప్పటి శృతి హాసన్ కు ఎంత తేడా అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఆ నవ్వులో మాత్రం మార్పు రాలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోటి అంతకంటే చిన్నప్పటి ఫొటో. ఇందులో కూడా సింపుల్ టీ షర్ట్ అండ్ షార్ట్ లో శృతిని చూడవచ్చు. ఇక ఈ ఫొటోలో శృతి హెయిర్ స్టైల్ చాలా పొట్టిగా ఉంది. మొత్తానికి రెండు ఫొటోల్లో కూడా శృతి చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్ ప్రస్తుతం బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా షో లు.. వెబ్ సిరీస్ లు మరియు స్టేజ్ మ్యూజిక్ షో లు కూడా ఈమె చేస్తోంది. శృతి హాసన్ మంచి గాయకురాలు మాత్రమే కాకుండా సంగీతం వాయించడంలో కూడా ప్రావిణ్యం ఉంది. కమల్ హాసన్ కూతురు అయినా కూడా ఎప్పుడు కూడా తండ్రి పేరును వాడుకుని గుర్తింపు తెచ్చుకునేందుకు ఆమె ప్రయత్నించలేదు. స్వయం కృషితో ఎదిగింది.