‘మరణమృదగం’లో శ్రీకాంత్ కి జోడీగా ‘పటాస్’ బ్యూటీ..!

0

శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”మరణమృదగం”. హరిప్రియ మూవీస్ బ్యానర్ పై మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపు రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ రెబ్బ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో ప్రధాన కథానాయకిగా శృతిశోధి ని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నందమూరి కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పటాస్’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది శృతిశోధి. ఆ తర్వాత ‘సుప్రీమ్’ ‘మీలో ఎవరు కోటేశ్వరుడు’ వంటి చిత్రాలలో నటించిన శృతిశోధి.. ఇప్పుడు శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ కుంచపు రమేష్ మాట్లాడుతూ… ‘మరణమృదంగం’ చిత్రంలో హీరో శ్రీకాంత్ కు జోడిగా ‘పటాస్’ ఫేమ్ శృతిశోది ఖరారు అయ్యింది. శ్రీకాంత్ యాక్షన్ రివేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదొక మంచి కథ శ్రీకాంత్ కు బాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాతో శ్రీకాంత్ కు మంచి బ్రేక్ లభిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్లు దర్శకుడు వెంకటేష్ రెబ్బ ఈ సినిమాను తీస్తున్నారు. మేము ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు డి.తులసీ దాస్ అందిస్తుండగా మంత్ర ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. చిట్టిబాబు కెమెరామెన్ గా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.