బాబాయి అబ్బాయి సినిమాకు ముందు చిన్న సర్ ప్రైజ్

0

మెగా.. నందమూరి.. దగ్గుబాటి ఫ్యామిలీలకు చెందిన బాబాయి అబ్బాయిలు సినిమాలు చేస్తే చూడాలని ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాబాయి అబ్బాయి సినిమా వచ్చేది అనుమానమే కాని త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ మూవీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో బాబాయి మరియు నేను చేసేందుకు ఒక మంచి కథ లభించింది. త్వరలోనే ఆ సినిమాను మొదలు పెడతాం అంటూ రానా ప్రకటించాడు. దగ్గుబాటి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈసమయంలోనే సినిమా కంటే ముందు వీరిద్దరు కలిసి ఒక రియాల్టీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ప్రముఖ ఓటీటీ కోసం నిర్వహించబోతున్న రియాల్టీ షో లో రానా మరియు వెంకటేష్ లు కలిస పాల్గొంటారు అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు కాని త్వరలోనే సినిమా కంటే ముందు బాబాయి అబ్బాయిని కలిసి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై చూస్తామని మీడియా వర్గాల వారు బలంగా చెబుతున్నారు. ప్రస్తుతం వెంకీ ‘నారప్ప’ సినిమాను ముగించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరో వైపు రానా ‘విరాటపర్వం’ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా వీరు ఇతర సినిమాలు కూడా కమిట్ అయ్యి ఉన్నారు. కనుక వీరి కాంబో మూవీ రావాలంటే కనీసం ఏడాది అయినా పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఓటీటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.