జిమ్ లో అందాల ఆరబోత

0

బాలీవుడ్ హాట్ బ్యూటీ సోఫీ చౌదరి ఈమద్య కాలంలో సినిమాల్లో కనపించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా సందడి చేస్తోంది. 2005 సంవత్సరంలో షాదీ నెం.1 తో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోఫీ చౌదరి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించింది.. కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.

మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత సౌత్ లో కనిపించలేదు. బాలీవుడ్ లో కూడా ఈమె జాడ లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె హాట్ ఫొటో షూట్ లు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. పెద్ద ఎత్తున అందాలు ఆరబోస్తున్న ఈ అమ్మడు తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ సెల్ఫీ తీసుకుంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింగ ఆమె ఫాలోవర్స్ ను తెగ అలరిస్తోంది.

జిమ్ లో వర్కౌట్ లో రెగ్యులర్ గా చేస్తూ ఇప్పటికి కూడా యంగ్ హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా తయారు అయ్యింది. ఈ అమ్మడు నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా రెండు పదుల వయసులో బ్యూటీ అన్నట్లుగానే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్ గా ముందు ముందు ఆఫర్లు దక్కించుకునేలా ఈ అమ్మడి ఫిజిక్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.