తిమ్మరుసుకే దిమ్మతిరిగే ట్రీట్ ముందుంది!

0

`ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య`తో నటుడు సత్యదేవ్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. నటుడిగా అతడికి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమా తిమ్మరుసు. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ కథానాయిక. కిర్రాక్ పార్టీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు శరణ్ కొప్పిశెట్టికి రెండవ చిత్రమిది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహామంత్రి తిమ్మరుసు పేరునే ఈ మూవీకి టైటిల్ గా ఎంపిక చేయడం ఆసక్తికరం.

`తిమ్మరుసు` అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై 30 న రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా సత్యదేవ్ -ప్రియాంక జవాల్కర్ జంటపై తెరకెక్కించిన ప్రోమో సాంగ్ నుంచి ఒక ఫోటో రిలీజైంది. ఈ ఫోటోలో ప్రియాంక జవాల్కర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. వైట్ షర్ట్ మినీ స్కర్ట్ ధరించి గాగుల్స్ పెట్టుకుని కార్ పై కూచుని గాలి పంకాను ఆస్వాధిస్తూ ఎంతో పోష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. అలాగే సూట్ ధరించిన సత్యదేవ్ అంతే స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రోమో షూట్ నుండి స్టిల్ స్టైలిష్ గా ఆకట్టుకుంది.

శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్- ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుజన్ యరబోలు ఒక నిర్మాత. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తరవాత రిలీజవుతున్న తొలి చిత్రంగా తిమ్మరుసు రికార్డులకెక్కుతోంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. నారప్ప-దృశ్యం 2-విరాటపర్వం థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఓటీటీల్లో రిలీజవుతున్నాయన్న ప్రచారం ఉంది.