Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎస్.పి బాలు ఆరోగ్య పరిస్థితిపై చరణ్ సందేశం

ఎస్.పి బాలు ఆరోగ్య పరిస్థితిపై చరణ్ సందేశం


గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5 న కోవిడ్ 19 చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 13 న అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయు కి తరలించారు. ఆ తర్వాత మీడియాల్లో ప్రచారం గురించి తెలిసిందే. దీనిపై కుటుంబ సభ్యులు కలతకు గురయ్యారు. ఎంజీఎం ఆస్పత్రి వర్గాల ప్రకారం.. బాలు కుమారుడు ఎస్.పి.చరణ్ ఎప్పటికప్పుడు నాన్నగారి ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్.పి.చరణ్ ఒక వీడియో సందేశాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అందులో అతను తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడారు 74 ఏళ్ల ఎస్.పి.బి కోవిడ్ నుంచి కోలుకుంటున్నారని 90 శాతం ఆయన ఘాడమైన మత్తులో లేరని తెలిపారు. నేను ఈ రోజు నా వైద్యులతో సంభాషించాను. అంతా మామూలే అనిపిస్తుంది. నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు అని వెల్లడించారు

నా తండ్రి చికిత్సపై శ్రద్ధగా పనిచేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు. అనారోగ్యం నుండి కోలుకునేలా చూసుకోండి అని అన్నారు. ఆ తర్వాత వేరొక పోస్టులోనూ అభిమానులనుద్ధేశించి ఆవేదనను వ్యక్తం చేసారు చరణ్. ఈ పోస్టులను తమిళంలో పెట్టమని చాలా మంది నన్ను అడిగారు. నేను ఇంగ్లీషులో మాట్లాడటానికి కారణం నాన్నకు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. నాకు ఈ పోస్టులను తమిళం- తెలుగు- హిందీ- కన్నడ- మలయాళం లేదా అతను పాడిన అన్ని ఇతర భాషలలో పెట్టాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి“ అని కోరారు.

 

View this post on Instagram

 

#SPB health update

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on