మహేష్ తో మల్టీస్టారర్ చేయాలన్న సుధీర్ బాబు

0

సూపర్ స్టార్ మహేష్ కి బావగా సుధీర్ బాబు అభిమానులకు సుపరిచితుడే. ఘట్టమనేని అల్లుడుగా అతడి కంటూ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ ఫ్యాన్స్ అండదండలు ఉన్నాయి. టాలీవుడ్ లో పన్నెండేళ్ల కెరీర్ లో తనని తాను స్టార్ గా మలుచుకునేందుకు ఎంతో శ్రమిస్తూనే ఉన్నాడు. స్వతహాగా అథ్లెట్ కం బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు టాలీవుడ్ లోనే పర్ఫెక్ట్ ఫిట్ బాడీని 6 ప్యాక్ ని మెయింటెయిన్ చేసే హీరోగా గుర్తింపు ఉంది.

అతడు నటించిన తాజా చిత్రం `వి` ఈ సెప్టెంబర్ లో ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మల్టీస్టారర్ ట్రెండ్ పైనా.. మహేష్ బావపైనా చేసిన వ్యాఖ్య అభిమానుల్లో వాడి వేడిగా చర్చకు తెరతీసింది. ఇంతకీ సుధీర్ ఏమని అన్నాడు? అంటే..

మహేష్ తో మల్టీస్టారర్ మూవీ చేయాలనుందని.. మరీ అంత పెద్ద రేంజ్ కాకపోయినా చిన్న రోల్ లో అయినా చేస్తే చాలని సుధీర్ బాబు అన్నారు. మహేష్ తో ఎలా అయినా కనిపించొచ్చు. కానీ ఏదన్నా మంచి రోల్ అయితే ఇంకా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాదు తక్కువ పెర్ఫామెన్స్ తో ఎక్కువ ప్రభావం చూపించగలిగే ఏకైక హీరో మహేష్!! అని కూడా కితాబిచ్చేశాడు. ఇక కుటుంబం పరంగా తరచూ కలుస్తుంటామని వెల్లడించాడు. అన్నట్టు ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది కాబట్టి మహేష్ – సుధీర్ మల్టీస్టారర్ కోసం కథ రాస్తున్న దర్శకరచయితలెవరైనా సుధీర్ ని సంప్రదిస్తే ఆ లక్కీ ఛాన్సు కష్టమేమీ కాదేమో!