బిగ్ సినిమా బిగ్ స్ర్కీన్.. మహేష్ రియాక్ట్

0

కరోనా కారణంగా హాలీవుడ్ నుండి స్థానిక భాషల సినిమాల వరకు ఆగిపోయాయి. వేల కోట్ల రూపాయలు నిర్మాతలకు నష్టం. కరోనా ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉంది. ఈ సమయంలో ఇంకా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమాల మేకింగ్ కు ముందుకు రావడం లేదు. అయితే చాలా దేశాల్లో మాత్రం థియేటర్లను ఓపెన్ చేశారు. ఇండియాలో కూడా త్వరలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా నాలుగు నెలల క్రితం విడుదల అవ్వాల్సిన ‘టెనెట్’ మూవీ రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన టెనెట్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. దాదాపుగా 70 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల కూడా అద్వితీయమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నట్లుగా రిపోర్ట్ వస్తుంది. ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ బిగ్ థియేటర్ లో చూసే వీడియోను షేర్ చేశాడు.

భారీ జనాల మద్య కూర్చుని మాస్క్ ధరించి సినిమాను చూసిన టామ్ ట్విట్టర్ లో బిగ్ సినిమా బిగ్ స్క్రీన్ లవ్డ్ ఇట్ అంటూ వీడియోను షేర్ చేశాడు. ఆ ట్వీట్ ను మహష్ బాబు రీ ట్వీట్ చేశాడు. ‘మిషన్ ఇంపాజిబుల్.. సేస్ హూ’ అంటూ పేర్కొన్నాడు. టామ్ క్రూజ్ ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.