Templates by BIGtheme NET
Home >> Cinema News >> పెళ్లి వేడుకలో సూర్య చేసిన పనికి అంతా షాక్

పెళ్లి వేడుకలో సూర్య చేసిన పనికి అంతా షాక్


స్టార్ హీరోలు తమ ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొనడం కామన్ గా కనిపిస్తుంది. కాని గెస్ట్ లుగా వెళ్లిన సమయంలో సింపుల్ గా వెళ్లి వధు వరులను ఆశీర్వదించి వచ్చేస్తుంటారు. కాని తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం తన సినిమాకు దర్శకురాలిగా చేసిన సుధ కొంగర కూతురు వివాహ వేడుకలో పాల్గొనడమే కాకుండా అక్కడ పెళ్లి పనుల్లో కూడా భాగస్వామ్యం అవ్వడం అందరి దృష్టని ఆకర్షించింది. తెలుగు దర్శకురాలు అయిన సుధ కొంగర ఇటీవల సూర్యతో సూరారై పోట్రూ సినిమాను తెరకెక్కంచింది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సూరారై పోట్రు సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకురాలు సుధ కొంగరను ఆకాశానికి ఎత్తేలా మాట్లాడిన సూర్య ఇప్పుడు ఆమె ఇంట జరిగిన పెళ్లి వేడుకలో కీలకంగా ఉండి ఇలా పెళ్లి కూతురుకు పట్టే పందిరిని తాను పట్టుకున్నాడు. ఈ ఫొటోలో జీవీ ప్రకాష్ కూడా ఉన్నారు. ఒక దర్శకురాలి కూతురు పెళ్లికి ఇలా స్టార్ హీరో పందిరిని పట్టుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ఫొటో సూర్య సింప్లిసిటీని చూపిస్తుంది అంటూ నెటిజన్స్ మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.