స్టార్ హీరోపై మాజీ భార్య కామెంట్ మెంటలెక్కిస్తోందిగా!

0

“నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవను. ఎవరి కోసమూ బాధ పడుతూ ఒక్క రోజును కూడా వృథా చేయను“ అంటోంది హృతిరోషన్ మాజీ భార్య సుసానే ఖాన్. జీవితంలో వెనుదిరిగే ప్రసక్తిలేదంటూ ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. నీలిరంగు కోట్.. ఫార్మల్ వేర్ ధరించి పక్కా కాన్ఫిడెన్స్ తో వున్న బిజినెస్ ఉమెన్ లా సుసానే ఖాన్ లుక్ వైరల్ గా మారింది.

భర్త హృతిక్ రోషన్ నుంచి మనస్పర్థల కారణంగా సుసానే 2014లో విడిపోయింది. అప్పటి నుంచి హృతిక్ కి పిల్లలు టచ్ లో వుంటున్నా ఆమె మాత్రం దూరంగా వుంటోంది. సుసానే ఖాన్ ఇంటీరియల్ డిజైనింగ్ లేబుల్ ది చార్ కోల్ అనే పేరుతో ఓ ప్రాజెక్ట్ ని రన్ చేసిన సుసానే ఖాన్ ఆ తరువాత దాన్ని పక్కన పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ దాన్ని తిరిగి ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఫొటో ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ ని హృతిక్ సూపర్ అంటూ కామెంట్ చేస్తే లుక్ మార్పు కోసం ప్రయత్నించానని సుసానే ఖాన్ నవ్వుతున్న ఎమోజీలని షేర్ చేసింది. అయితే సుసానే ఖాన్ చేసిన కామెంట్ ఎవరి గురించి? హృతిక్ అవసరం తనకు లేదని.. ఇకపై రాదన్న భావనతోనే సుసానే ఇలా కామెంట్ చేసిందా? అని అంతా ఆరా తీస్తున్నారు.