చెమటలు పట్టించేస్తున్న జిమ్మింగ్ బ్యూటీ

0

నిరంతరం కఠిన వ్యాయామం చేస్తూ ఆ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే హార్డ్ వర్కింగ్ కథానాయికల బ్యాచ్ లో దిశా పటానీ.. రకుల్ ప్రీత్ సింగ్.. మలైకా అరోరా.. జాన్వీ వంటి భామలు ఎంత స్పీడ్ గా ఉంటారో తెలిసిందే. శర్మా గాళ్స్ నేహా .. ఐషా కూడా అంతే స్పీడ్ తో దూసుకుపోతున్నారు.

ఇప్పుడు ఈ భామలందరికీ ఓ అమ్మడి నుంచి ఠఫ్ కాంపిటీషన్ ఎదురు కానుంది. ఇంతకీ ఎవరా అమ్మడు? అంటే.. అందరికీ సుపరిచితురాలైరైన కృతి సనోన్. ఈ అమ్మడు రేసులోకి వచ్చేసింది. నిరంతరం ఫిట్నెస్ కి సంబంధించిన వ్యాయామ వీడియోలో చెమటలు పట్టించేస్తోంది. ఇలాంటి వేడెక్కించే వీడియోల్ని షేర్ చేసి అభిమానులను విస్మయానికి గురి చేస్తూ.. మేజర్ `ఫిట్స్పిరేషన్` తో గుండెలు కొల్లగొడుతోంది. లాక్ డౌన్ లో ఇంట్లోనే తీరిగ్గా ఉన్న ఈ బ్యూటీ ఫిజిక్ పరంగా చాలా మార్పులు చేసిందండోయ్. ఫిట్స్ పిరేషన్ తో చెమటలు కక్కేస్తున్న వ్యాయామ వీడియోని కృతి తాజాగా విడుదల చేయడంతో అది కాస్తా యూత్ లో వైరల్ గా మారింది.

కృతి సనోన్ ఇంతగా ఎందుకు శ్రమిస్తోంది? అంటే… మిమి చిత్రం కోసం పెరిగిన అదనపు బరువును తగ్గించుకునే పనిలో ఉందిట. ఈ మూవీలో సర్రోగేట్ తల్లి పాత్ర కోసం బాగా బరువు పెరిగింది. అందుకే అంత సీరియస్ గా చెమటలు పట్టేలా కసరత్తులు చేసి బరువు తగ్గించేస్తోంది. కృతి సనోన్.. రాజ్ కుమార్ రావుతో కలిసి షూటింగ్ కోసం ఛండీఘర్ కి వెళ్లింది. మిమి చిత్రంలో మనోజ్ పహ్వా- సుప్రియ పాథక్- పంకజ్ త్రిపాఠి నటించారు.