తమన్నా పేరెంట్స్‌కి కరోనా.. కోలుకోవాలని సమంత, కాజల్ ప్రార్థనలు

0

కరోనా మహమ్మారి విజృంభనకు సాధారణ, మధ్య తరగతి వాళ్లే కాదు.. సెలబ్రిటీలు కూడా కుదేలౌతున్నారు. ఇప్పటికే టీవీ, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు చాలామంది కరోనా బారిన పడ్డారు. అమితాబ్, రాజమౌళి, సింగర్ సునీత, రవిక్రిష్ణ ఇలా చాలామంది కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. అయితే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనాతో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ తమన్నా తన పేరెంట్స్‌కి కరోనా సోకిందని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

గత వారాంతంలో తన పేరెంట్స్‌లో చిన్నపాటి కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో జాగ్రత్తలు పాటిస్తూ కరోనా పరీక్షలు చేయగా.. తన పేరెంట్స్‌కి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు తెలిపారు తమన్నా. అయితే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి డాక్టర్ల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలియజేశారు తమన్నా. అయితే ఆ దేవుడి దయతో మిగిలిన ఇంట్లో వాళ్లకి కాని.. తనకు కాని కరోనా లక్షణాలు లేవని.. టెస్ట్‌లు చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్టు పోస్ట్‌లో తెలిపారు తమన్నా.

అయితే తమన్నా పోస్ట్‌పై స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్‌లు స్పందించారు. ఆంటీ అంకుల్ త్వరగా కోలుకోవాలని ప్రేయర్ చేస్తున్నట్టు ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on