షేప్ అవుట్ అవుతున్న మిల్కీ బ్యూటీ..!

0

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన తమన్నా కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య కరోనా సోకడంతో సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ వస్తోంది. కరోనా కారణంగా దాదాపు నెలరోజులు బెడ్ రెస్ట్ లో ఉండటంతో ఈ బ్యూటీ షేప్ అవుట్ అయిందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య తమన్నా ఫోటోలు చూసిన వారు చాలా స్లిమ్ గా ఫిట్ గా ఉండే ఈ భామకి కాస్త ఒళ్ళు చేసిందని.. కరోనా కష్టాలు బాగానే వచ్చాయని అంటున్నారు. ఫిజిక్ అండ్ ఫిట్నెస్ హీరోయిన్ల జీవితంలో ఓ భాగమని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఫిగర్ ఏ మాత్రం షేప్ అవుట్ అయినా ఇండస్ట్రీ నుంచే గెట్ అవుట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన మిల్కీ బ్యూటీ మళ్ళీ శరీర సౌష్టవం కోసం గట్టి కసరత్తులే చేస్తోందని తెలుస్తోంది.

తమన్నా ప్రస్తుతం యాక్షన్ హీరో గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. అలానే సత్యదేవ్ హీరోగా నటించనున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. దీంతో పాటు యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో కూడా మిల్కీ బ్యూటీ నటించనుంది. హిందీలో టబు పోషించిన రోల్ లో తమన్నా కనిపించనుంది. తమన్నా ది హీరోయిన్ రోల్ కాకపోయినప్పటికీ సినిమాలో చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కమిటైన సినిమాల్లో మళ్లీ జాయిన్ అవ్వడానికి మరో నెల రోజులు టైమ్ పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లోపు బాంబేలో కసరత్తులు చేసి మళ్లీ స్లిమ్ గా అవ్వడానికి తమన్నా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మిల్కీ బ్యూటీ డిజిటల్ డెబ్యూ ‘నవంబర్ స్టోరీ’ త్వరలోనే డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలకానుంది. ఇది తమిళంలో రూపొందినప్పటికీ తెలుగులో కూడా అనువాదం చేయనున్నారు. ఇటీవలే రిలీజైన ‘నవంబర్ స్టోరీ’ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.