నటి ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు!

0

తమిళ్ టీవీనటి చిత్ర ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్రను ఆమె భర్త హేమంత్ హింసించాడని ఆమెను అనుమానించి కన్యత్వ పరీక్షలు కూడా చేయించేందుకు చూశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. హేమంత్ కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. చిత్ర-హేమంత్ కామన్ ఫ్రెండ్ బయట పెట్టినట్టు చెబుతున్న ఈ విషయాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. దీంతో.. పోలీసులు ఆ దిశగా కేసును విచారిస్తున్నారు.

ఒంటిపై దెబ్బలు..
చెన్నైలోని నాసరపేటలోని ఓ స్టార్ హోటల్ లో గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన చిత్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే.. ఆ సమయంలో వ్యాపారవేత్త అయిన ఆమె భర్త అదే హోటల్ లో ఉన్నాడని తేలడం.. చిత్ర ఒంటిపై పలు చోట్ల గాయాలు కనిపించడంతో పోలీసులు ఆమె భర్త హేమంత్ ను అరెస్టు చేశారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చింది.

షాకింగ్ విషయాలు చెప్పిన ఫ్రెండ్..
చిత్ర ఆమె భర్త హేమంత్ కామన్ ఫ్రెండ్ రోహిత్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు అంశాలు బయటపెట్టినట్టు సమాచారం. చిత్ర మరణానికి ఆమె భర్తే కారణమని రోహిత్ పరోక్షంగా వెల్లడించినట్టు ప్రచారం సాగుతోంది.

కన్యత్వ పరీక్షకూ..
చిత్ర క్యారెక్టర్ మీద ఆమె భర్త హేమంత్ కు అనేక అనుమనాలు ఉన్నాయని అందుకే.. ఆమెకు కన్యత్వ పరీక్షలు చేయించడానికి కూడా సిద్ధమయ్యాడని రోహిత్ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. భార్యాభర్తలు నివాసం ఉండే అపార్ట్ మెంట్ లో ఓ డాక్టర్ ఉన్నారని తన భార్యకు కన్యత్వ పరీక్ష చేయాలని ఆ డాక్టర్ మీద హేమంత్ ఒత్తిడి తెచ్చాడని రోహిత్ బాంబు పేల్చినట్టు తెలుస్తోంది.

కుమిలిపోయిన చిత్ర..
చిత్రకు కన్యత్వ పరీక్ష చేయాలని హేమంత్ పట్టుబట్టిన విషయాన్ని సదరు డాక్టర్ చిత్రకు చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న చిత్ర.. రోహిత్ ఇతర సన్నిహితుల వద్ద కుమిలిపోయిందట. హేమంత్ కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆ విషయాలు తెలిసినా తాను అతన్ని పెళ్లి చేసుకున్నానని చిత్ర ఆవేదన వ్యక్తంచేసిందని ప్రచారం సాగుతోంది.

చిత్ర సహనటుడిపై దాడి..
చిత్రను పెళ్లి చేసుకోకముందే ఆమె మీద హేమంత్ కు అనేక అనుమానాలు ఉన్నాయని రోహిత్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడట. తమిళనాడులో ఫేమస్ అయిన ‘పాండియన్ స్టోర్స్’ సీరియల్ లో నటించిన చిత్ర.. చాలా ఫేమస్ అయ్యింది. అయితే.. ఈ సీరియల్ లో చిత్రతో కలిసి నటించిన కుమార్ అనే నటుడిపై హేమంత్ దాడిచేశాడని రోహిత్ వెల్లడించాడట. చిత్రతో ఇకపై నటించొద్దని చితకబాదేశాడని రోహిత్ సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. చిత్ర మృతి కేసును ఆ దిశగా విచారిస్తున్నట్టు సమాచారం.