ఆర్జీవీ డిస్కవరీ సన్నీనే కొట్టేట్టు..!

0

ఆర్జీవీ తెరకెక్కించిన వంగవీటి సెన్సేషన్స్ గురించి తెలిసినదే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అందులో పాత్రల గురించి జనం ముచ్చటించుకున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ నైనా గంగూలీ వంగవీటి రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ అనే చిత్రంలోనూ నైనా కథానాయిక. ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

నైనా కోల్ కతా అమ్మాయి. వంగవీటి మోహనరంగా బయోపిక్ తో వెలుగులోకి వచ్చాక.. వరుసగా అరడజను పైగా చిత్రాల్లో నటించేసింది. ఈ భామ బాలీవుడ్ లో మేరీ బేటి సన్నీలియోన్ బన్నా చాహితీ హై అనే చిత్రంలో నటించింది. అలాగే చరిత్రహీన్ అనే వెబ్ సిరీస్ లోనూ వేడెక్కించే అందాల ట్రీట్ తో అదరగొట్టింది. చరిత్రహీన్ సీక్వెల్ సిరీస్ లోనూ నటించింది. 2020లో జోహార్ అనే చిత్రానికి సంతకం చేసింది. ప్రస్తుతం చరిత్రహీన్ 3 సిరీస్ లోనూ అమ్మడు నటిస్తోంది.

ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ కి అదిరిపోయే విజువల్ ట్రీటిస్తోంది. నైనా తాజా ఫోటోషూట్లో జీన్స్ టాప్ లో దుమారం రేపింది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది.