కఠోర శిక్షణతో రాటుదేలుతున్న తాప్సీ

0

హార్డ్ వర్క్ క్రమశిక్షణతో బాలీవుడ్ లో తనదైన మార్క్ వేస్తోంది అందాల తాప్సీ. అప్పుడప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ కామెంట్లతో వివాదాల్లోకి వస్తున్నా.. కెరీర్ పరంగా ఈ అమ్మడి దూకుడుకు ఎదురే లేకుండా పోయింది. సౌత్ టు నార్త్ తాప్సీ ప్రయాణం గురించి తెలిసిందే. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తనదైన శైలిలో దూసుకెళుతున్న ఈ భామ మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

తాప్సీ ప్రస్తుతం `రష్మి రాకెట్` కోసం తీవ్రంగా శిక్షణ పొందుతోంది. ఈ చిత్రంలో తాను అథ్లెట్ గా నటిస్తోంది. అందుకు అవసరమైన శిక్షణలో ప్రస్తుతం పూర్తి బిజీగా ఉంది. ఆన్ ట్రైనింగ్ ఫోటోల్ని తాజాగా తాప్సీ అభిమానులకు షేర్ చేసింది.

వీటిలో ట్రైనర్ తో కఠోరంగా వర్కవుట్ చేస్తోంది. బ్లాక్ టాప్ – వైట్ షార్ట్స్ లో తాప్సీ కనిపించింది. శరీరం బలప్రయోగం ఈ ఫోటో చూస్తుంటేనే తాప్సీ ఎంతగా శ్రమిస్తోందో అర్థమవుతోంది. కండరాలపై ‘క్రూరమైన దాడి’ ఇది. థైస్ పై ఒత్తిడి పడుతుందని వెల్లడించింది.

ఇది నాపై దారుణమైన దాడి కాదు.. సాంకేతికంగా నా కండరాలపై మాత్రమే! అని తెలిపింది. తాప్సీ అభిమానులు ఆమె ఎంపికలు అంకితభావంపైనా ఎంతో విస్మయంతో ఉన్నారు. “మామ్ మీరు నిజంగా చాలా కష్టపడుతున్నారు“ అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. “హృదయ రాణి” అంటూ మరొకరు ప్రేమను కురిపించారు.

తాప్సీ తన ఇన్స్టాగ్రామ్ కథలలో ఒక వీడియోను కూడా పంచుకుంది అది ఆమె బృందం రుచికర ఆహారం తినడాన్ని చూసి ఈర్ష్య పడుతోంది. తాప్సీ ప్రస్తుతం మూవీ కోసం కఠినమైన డైట్ లో ఉన్నారు. ఆమె బీచ్ వద్ద ఒక ప్రత్యేక ఎనర్జీ డ్రింక్ తాగుతున్న చిత్రాన్ని కూడా పంచుకుంది.

తాను సేవించే పానీయంలో పసుపు & అల్లం శక్తివంతమైన ఏజెంట్లు కాబట్టి ట్యాబ్లెట్ల అవసరం లేకుండా.. కఠినమైన అథ్లెటిక్ శిక్షణ వల్ల కండరాలలో నొప్పి మంటను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది అని తాప్సీ వెల్లడించింది.

ఈ చిత్రంలో తాప్సీ గుజరాతీ అమ్మాయిగా నటిస్తోంది. ఆమె చాలా వేగంగా నడుస్తుంది.. అందుకే గ్రామస్తులు ఆమెను రష్మి రాకెట్ అని పిలుస్తారు. ఈ చిత్రానికి నందా పెరియసామి- అనిరుద్ద గుహా- కనికా ధిల్లాన్ కథనం అందించారు. ఈ చిత్రంలో భవేష్ జోషి సూపర్ హీరోగా కనిపించనున్నారు. ప్రియాన్షు పెన్యులీ తాప్సీ భర్తగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2021 లో విడుదల కానుంది.