బిబి3 నుండి ప్రయాగ తప్పుకోవడానికి కారణం చెప్పిన నిర్మాత

0

నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందబోతున్న మూడవ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత మేరకు పూర్తి అయ్యింది. కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పునః ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సినిమాకు మలయాళి ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఆమె హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా చేసేందుకు సిద్దం అయ్యారు. ఆ సమయంలో సినిమా నుండి ఆమె తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

బాలకృష్ణకు మరియు ఆమెకు మద్య వయసు తేడా చాలా ఉందని.. ఇద్దరి మద్య ఆ వయసు తేడా కనిపిస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను తప్పించారంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని అసలు విషయం అది కాదంటూ నిర్మాత మిర్యాల రాజేందర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసిన విషయం నిజమే అయినప్పటికి ఆమె మాకు అవసరం అయిన సమయంలో డేట్లు ఇవ్వలేను అన్నారు. మలయాళంలో ఆమె పలు సినిమాలు చేస్తున్న కారణంగా ఎక్కువగా డేట్లు ఇవ్వలేకను అన్నారు. ఆ కారణంగానే ఆమె తప్పుకున్నారంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో ప్రయాగ స్థానంలో అఖిల్ మూవీ హీరోయిన్ సాహేషా సైగల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా పూర్ణను ఇప్పటికే ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ రెండు విభిన్నమైన గెటప్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఒక గెటప్ అఘోరాలా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే సినిమా విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.