‘సర్కారు వారి పాట’ ఆలస్యంకు మహేష్ కారణం కాదట

0

ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఈ సంవత్సరంలో సర్కారు వారి పాట సినిమాను మొదలు పెట్టే ఉద్దేశ్యంతో లేడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను ప్రకటించి ఆరు నెలలు దాటుతుంది. మొన్నటి వరకు అంటే కరోనా భయంతో అందరిలాగే మహేష్ కూడా షూటింగ్ కు దూరంగా ఉన్నాడు అనుకున్నారు. కాని గత రెండు నెలలుగా షూటింగ్ లు జోరందుకున్నాయి. సీనియర్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా సెట్ లో జాయిన్ అయ్యారు. కాని మహేష్ బాబు మాత్రం కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతానంటూ చెబుతున్నాడని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపించాయి. కాని అవి ఎంత మాత్రం నిజం కాదని తేలిపోయింది.

మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో ఎప్పుడెప్పుడు జాయిన్ అవ్వాలా అనే ఆసక్తితో ఉన్నాడట. సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో అనుకున్నారు. కథానుసారం కీలక సన్నివేశాలను అక్కడ చేయాల్సి ఉంది. అందుకోసం అక్కడ లొకేషన్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. యూనిట్ సభ్యులు అంతా కూడా అమెరికా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో యూనిట్ లో కొందరికి వీసా సమస్య ఏర్పడిందట. దాంతో ప్రస్తుతానికి వాయిదా వేశారని తెలుస్తోంది. కరోనాకు భయపడి మహేష్ షూటింగ్ లకు దూరంగా ఉండటం లేదని.. ఆయన కరోనా ఆందోళన లేకుండా హాయిగా దుబాయికి హాలీడే ట్రిప్ కూడా వేశారు.

సర్కారు వారి పాట ఎప్పుడు మొదలు పెట్టినా జాయిన్ అయ్యేందుకు రెడీగా మహేష్ బాబు ఉన్నాడు అంటూ ఆయన సన్నిహితులు మీడియా మిత్రుల వద్ద చెప్పుకొచ్చారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ లో అమెరికా ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. దాదాపు రెండు నెలల భారీ షెడ్యూల్ ను అక్కడ చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో మరో మూడు నెలల రెగ్యులర్ షూటింగ్ చేసి సినిమాను ముగించేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నాడట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపే విధంగా ఉంటుందని సమాచారం.