Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లకే ఎక్కువ నష్టం !

మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లకే ఎక్కువ నష్టం !


సినీ పరిశ్రమలో ఏమి జరుగుతుంది ? పరిశ్రమ మొత్తానికే నష్టం జరుగుతోంటే, ఎందుకు చాలామంది స్టార్ హీరోలు, మరియు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదు ? ‘మా’ ఎన్నికల్లో లెక్కకు మించి నటీనటులు ముందుకు వస్తారు. ఎవరికీ వారు సీక్రెట్ గా తమ సపోర్ట్ ను పోటీదారులకు తెలియజేస్తారు. మరి ‘మా’ అనే సంస్థ కంటే, మొత్తం సినిమా పరిశ్రమ మనుగడ ముఖ్యం కదా ?

అసలు సినీ పరిశ్రమ ఆదాయానికి నష్టం వస్తే.. మొత్తం సినిమా వాళ్ళకే నష్టం అనే విషయాన్ని ఎందుకు సినిమా వాళ్ళు గ్రహించడం లేదు ? ఏపీలో థియేటర్ల పరిస్థితిని, టికెట్ వ్యవహారాల బాగోతాన్ని ఎందుకు మన హీరోలు నిలదీయలేకపోతున్నారు ? ఒక్క పవన్ కళ్యాణ్, మెగాస్టార్, నాగార్జున తప్ప.. టికెట్ల రేట్లు విషయంలో ఇప్పటి వరకు మరో స్టార్ హీరో ముందుకు వచ్చిన పాపాన పోలేదు.

లీడింగ్ లో ఉన్న మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లు కూడా ‘ఏపీ సర్కారు టికెట్ల విధానం’ పై తమదైన అభిప్రాయాన్ని తెలియజేసి.. అందరూ కలిసికట్టుగా ఉంటే.. కచ్చితంగా జగన్ ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి మహేష్ కి జగన్ ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటపుడు మహేష్ ఎందుకు ముందడుగు వేయడం లేదు ?

అలాగే ఎన్టీఆర్ పై జగన్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా ఆ మధ్య ఎన్టీఆర్ ని తమ ప్రభుత్వ యాడ్ లో నటింపజేయాలని జగన్ భావించారు కూడా. కారణం.. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ మామయ్య జగన్ కి మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగానూ సహాయ సహకారాలు అందించారు. అన్నిటికి కంటే ముఖ్యంగా చంద్రబాబు వ్యక్తిత్వం పై ప్రజల్లో నమ్మకం పోగొట్టేలా కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా.

పైగా ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులు కొడాలి నాని, వంశీ లాంటి వారు జగన్ ప్రభుత్వంలో క్రియాశీలక వ్యక్తులు. కాబట్టి ఎన్టీఆర్ తల్చుకుంటే.. ఈ టికెట్ల వ్యవహారంలో కొంతవరకు సినిమా పరిశ్రమకు మేలు జరిగేలా చేయవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పినట్లు.. వైఎస్ కుటుంబానికి, మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పట్ల ఉన్న వైఖరి పై మోహన్ బాబు స్పందించి.. పరిశ్రమ మేలు కోసం జగన్ ను ఒప్పించొచ్చు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసమైనా వైసీపీ పెద్దలతో మోహన్ బాబు మాట్లాడి సర్దుబాటు చేయవచ్చు. ఒక సీనియర్ హీరోగా నిర్మాతగా ఇది ఆయనకు నైతిక బాధ్యత కూడా. మరి ఎందుకు మోహన్ బాబు గారు ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం.. మహేష్, ఎన్టీఆర్, మోహన్ బాబు ఇలా సైలెంట్ గా ఉంటే.. సినిమా ఇండస్ట్రీతో పాటు వారికి కూడా నష్టమే.