బాబోయ్ బాలయ్య ఇదేం టైటిల్?

0

బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మస్త్ జోరుగా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా.. ఆపై లాక్ డౌన్ అవ్వడం వల్ల షూటింగ్ ఆగిపోయింది. గత ఆరు నెలలుగా షూటింగ్ జరుగలేదు. అయితే సినిమా స్ర్కిప్ట్ విషయంలో మార్పలు చేర్పులు చేయడంతో పాటు టైటిల్ విషయంలో హీరోయిన్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై మరియు టైటిల్ ఏంటీ అనే విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతుంది.

బిబి3 మూవీకి ఇప్పటి వరకు ‘మోనార్క్’.. ‘డేంజర్’.. ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు టైటిల్స్ జాబితాలో మరోటి వచ్చింది. ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ టైటిల్ ఏంటీ అంటూ కొందరు అనుకుంటున్నారు. అయితే విభిన్నంగా సినిమా కథకు చాలా దగ్గరగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో ఒక సీన్ లో ఈ పదంను వాడటం జరుగుతుంది.

ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ గా పెట్టేందుకు బోయపాటి చర్చలు జరుపుతున్నాడట. ఈ టైటిల్ ను బయటకు లీక్ చేయగా నందమూరి ఫ్యాన్స్ నుండి మరియు నెటిజన్స్ విమర్శలు వస్తున్నాయి. కనుక ఈ టైటిల్ ను బోయపాటి ఫిక్స్ చేయక పోవచ్చు అనిపిస్తుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ సమయంలో టైటిల్ విషయంలో మేకర్స్ అప్పుడు క్లారిటీ ఇచ్చే అవకావం ఉంది.