పవర్ స్టార్ బర్త్ డే నాడు మూడు సర్ప్రైజ్ గిఫ్ట్స్…!

0

రేపు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అంటే అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాబోతున్న ఈ బర్త్ డేని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ సన్నాహకాలు చేస్తున్నారు. అయితే పవన్ పుట్టిన రోజు నాడు ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు స్క్రీన్ మీద చూసి మూడేళ్లు దాటిపోవడంతో ఆయన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ పవన్ ఇప్పటికే అధికారికంగా మూడు సినిమాలను అనౌన్స్ చేసాడు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి రేపు పవన్ నటిస్తున్న మూడు సినిమాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ రాబోతున్నాయి.

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి రేపు ఉదయం గం 9.09 నిమిషాలకు సప్రైజ్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న 27వ సినిమా అప్డేట్ కూడా రానుంది. రేపు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ రాబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ అప్డేట్ సాయంత్రం 4.05 నిమిషాలకు రాబోతుందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇలా మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తుండటంతో అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు రానున్న ఆ మూడు సర్ప్రైజులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.