శ్రావణి సూసైడ్.. అసలు కారకులు మారిపోయారు

0

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో తవ్వినకొద్దీ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. దేవరాజ్ సాయికృష్ణ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1 ఏ3 వీరి పేర్లను మార్చారు.

కొత్తగా టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ కేసులో ఏ-3 ముద్దాయిగా ఉన్న దేవరాజ్ పేరును ఏ1గా మార్చారు. అలాగే సాయికృష్ణారెడ్డిని ఏ-1 నుంచి ఏ2గా ఏ2గా ఉన్న అశోక్రెడ్డిని ఏ3గా మార్చారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను విచారించామని పోలీసులు తెలిపారు. దేవరాజ్ను ప్రేమించానని శ్రావణి తన కుటుంబ సభ్యులకు చెప్పిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో యాడ్ చేశారు. శ్రావణికి సాయికృష్ణారెడ్డి – అశోక్ రెడ్డితో సంబంధం ఉండడంతో దేవరాజ్ అందుకు అంగీకరించలేదని.. అందుకే గొడవలు జరిగాయని వెల్లడించారు.

కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన శ్రావణి సినిమాల్లో నటించాలనే కోరికతో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ చేరుకుంది. అప్పుడు తన ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో అశోక్ రెడ్డిని పరిచయం చేశాడు. ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాలో శ్రావణికి చిన్న రోల్ కూడా ఇప్పించాడు. అలా శ్రావణితో సాయి పరిచయం కొనసాగింది. తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్ అవకాశం రావడం ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆమె పేరెంట్స్ బ్రదర్ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే వారితో కూడా సాయికి పరిచయం ఏర్పడటంతో క్రమంగా ఇంటికి కూడా వచ్చేవాడు.

గతేడాది టిక్ టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ పరిచయం అయ్యాడు. వారిది ఒకే ప్రాంతం కావడంతో శ్రావణి అతనితో చనువుగా ఉండేది. కొద్దిరోజులు ఆమె ఇంట్లో కూడా అతనికి చోటు కల్పించింది. వీరిద్దరూ క్లోజ్గా ఉండటం.. సాయికి నచ్చలేదు. గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరింది. దీంతో దేవరాజ్ శ్రావణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆ రోజు సాయి ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధించారని దాడి చేశారని శ్రావణి పేర్కొన్న సంగతి తెలిసిందే.

శ్రావణి తనను పెళ్లి చేసుకోవాలని దేవరాజ్ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన సాయి అశోక్ రెడ్డి శ్రావణిని భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నెల 7వ తేదీన అజీజ్ నగర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రావణిని దేవరాజ్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్లో లంచ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన సాయి శ్రావణిపై చేయి చేసుకుని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. దేవరాజ్ను కలవవద్దని సాయి అశోక్ రెడ్డి కలిసి బెదిరించినట్టు ఇప్పటికే వెల్లడైంది.

కాగా.. దేవరాజ్ను చంపేస్తామని ఆర్థికంగా ఆదుకోబోమని శ్రావణిని వారిద్దరూ బెదిరించారు. ఇక లాభం లేదనుకొని శ్రావణి ఆత్మహత్యకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి వెళ్లిపోదామని దేవరాజ్ను అడిగింది. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ అంగీకరించలేదు. దీంతో ఇటు సాయి అశోక్ వేధింపులు.. దేవరాజ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శ్రావణి మనోవేదనకు గురైంది. అక్రమంలోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. కేసు విచారణ జరుగుతున్న కొద్దీ ఏ1 – ఏ2 – ఏ3 నిందితులుగా వారు మారిపోతున్నారు.