బిగ్ బాస్ పై తన బాధని వెల్లగక్కింది!

0

వితిక షేరు… ఓ హీరోయిన్ గా చాలా తక్కువ మందికే తెలుసు. వరుణ్ సందేశ్ వైఫ్ గా .. బిగ్బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా మాత్రమే ఆమె పాపులర్ అయ్యారు. బిగ్బాస్ 3లోకి ఎంటరైన వితిక ఆ తరువాత అనేక కారణాల వల్ల బయటికి వచ్చేసింది. తాజాగా సీజన్ 4 ప్రారంభమైన నేపథ్యంలో బిగ్బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. స్పోక్ మై హార్ట్ ఔట్ పేరుతో ఓ వీడియోని విడుదల చేసింది.

ఇందులో బిగ్ బాస్ గురించి.. అదే సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి..దాని వల్ల తను అనుభవించిన డిప్రెషన్ గురించి నెగిటివిటి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 తరువాత తను చాలా ఇబ్బందుల్ని మానసిక క్షభని ఎదుర్కొన్నానని తనలా అలా ఎవరూ కాకూడదని స్పష్టం చేసింది. తను 11 ఏళ్ల వయసులోనే టెలివిజన్ సీరియల్ ద్వారా నటిగా రంగప్రవేశం చేసిందట. కన్నడ చిత్రం అంతు ఇంతు ప్రీతి బంటులో 15 ఏళ్ళ వయసులో తను సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా ఆమెకు పేరుని గుర్తింపుని తెచ్చిన చిత్రాలు మాత్రం భీమిలి కబడ్డీ జట్టు… జుమ్మంది నాదం… ప్రేమా ఇష్క్ కాదల్.

ఆ తరువాత వరుణ్ సందేశ్ తో ప్రేమ పెళ్లి తరువాత మరోసారి వార్తల్లో నిలిచింది వితిక. టాలీవుడ్ లో ఆ జోడీని అంతా క్యూట్ జోడీ అంటూ ప్రశంసలు కురిపించారట. కానీ డిజిటల్ మీడియా మాత్రం తమపై విషం కక్కిందని చెబుతోంది. దీనిపై చాలా మంది నటనటులు ఫైట్ చేసినా ఈ విషసంస్కృతి కొనసాగుతూనే వుందని వాపోయింది. దీని వల్ల తన ఫ్యామిలీ చాలా మరోవేదనకు గురైందని వెల్లడించింది. ఇక బిగ్బాస్ సీజన్ గురించి మాట్లాడుతూ ఇందులో మంచి వుంది చెడూ వుంది. 24 గంటల జీవితంలో బిగ్ బాస్ వారు గంట సమయాన్ని మాత్రమూ కేటాయిస్తూ క్యారెక్టర్ లని డిసైడ్ చేస్తుంటారని.. ఇందులో పాల్గొనే వాళ్లు చేసేది నటనే కాకుండా కొంత అతిగా కూడా వుంటుందని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.