బిబి4 బ్యూటీకి రెండు ఆఫర్లు

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో సందడి చేసిన దివి దసరా రోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. సమంత హోస్టింగ్ చేసిన ఆ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలిచింది. ఆ ప్రత్యేకమైన ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన దివి ప్రేక్షకుల హృదయాలను మాత్రం వదిలి వెళ్లలేదు. ఆమె ఎక్కువగా వివాదాలకు వెళ్లకుండా చాలా సింపుల్ గా తన పని తాను అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. అందమైన దివి బయటకు రావడానికి కారణం అదే అయ్యి ఉంటుందని ఎక్కువ శాతం మంది అంటున్నారు. బిగ్ బాస్ వారికి ఎక్కువ ఫుటేజ్ గొడవల వస్తుంది. కాని దివి గొడవలకు దిగేది కాదు. అందుకే ఆమెను ఎలిమినేట్ చేసి ఉంటారు అనే టాక్ వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా దివికి మంచి ఫాలోయింగ్ దక్కింది.

హీరోయిన్ అవ్వాలని ఆశలు పెట్టుకున్న దివికి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ప్రముఖ ఓటీటీ కోసం రూపొందబోతున్న రెండు వెబ్ సిరీస్ ల్లో ఆఫర్లు వచ్చాయి. ఇదే సమయంలో ఆమె ఒకటి రెండు చిన్న సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మొదటి వెబ్ సిరీస్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన దివి ఇప్పుడు మొదటి సారి హీరోయిన్ గా నటించేందుకు సిద్దం అవుతుంది. బిగ్ బాస్ వల్ల దివికి బాగానే కలిసి వస్తుందనిపిస్తుంది.