Templates by BIGtheme NET
Home >> Cinema News >> బన్నీ ఆ ముచ్చట ఏమైనా చెబుతాడా?

బన్నీ ఆ ముచ్చట ఏమైనా చెబుతాడా?


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “పుష్ప”. బన్నీ పాన్ ఇండియన్ మొదటి చిత్రం కూడా ఇదే. దీంతో ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ పై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. త్వరలో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ సందర్భంగా బన్నీ తన అభిమానుల కోసం ఆల్రెడీ కొత్త సంవత్సరం గిఫ్ట్ ను సిద్ధంగా ఉంచిన సంగతి తెలిసిందే. వారి ఓన్ స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో స్టార్ హీరోయిన్ సమంతతో స్టార్ట్ చేసిన సెలెబ్రెటీ టాక్ షో ‘సామ్ జామ్’లో తన ఇంటర్వ్యూ తో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించనున్నాడు.

ఇప్పటికే షూట్ పూర్తి అయిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ను 2021 జనవరి 1 న ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే.. ఇందులో తన రాబోయే చిత్రం “పుష్ప”పై ఆసక్తికర టాపిక్ ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఎలాంటి సమాచారం ఉంటుందనేది తెలియాల్సి ఉంది. బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం.. నిజంగానే ఏమన్నా హింట్స్ ఇచ్చారా లేదా అన్నది తెలియాలి అంటే ఆ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.