రాజమౌళి అందరి పనిని ఈజీ చేస్తారు

0

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తో సినిమా అంటే చాలా కష్టం అని.. ఆయన నటీ నటులను మరియు సాంకేతిక నిపుణులను చాలా కష్టపెడుతాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కాని అవన్ని నిజం కాదని ఆయనతో వర్క్ చేసిన.. చేస్తున్న కొందరు చెబుతున్నారు. ఇటీవల మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బాహుబలి సమయంలోనే రాజమౌళితో వర్క్ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు వర్క్ చేయలేక పోయాను. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమాకు నాకు ఆ అవకాశం వచ్చిందని అన్నాడు.

రాజమౌళి తో సినిమా అనగానే చాలా మంది చాలా రకాలుగా భయ పెట్టారు. కాని ఆయనకు ఏం కావాలో చాలా క్లారిటీగా ఆయన ఉంటారు. పదే పదే మార్పులు చేర్పుల అవసరం ఉండదు. రచయితగా నా పనిని చాలా సులభం చేశారు. ప్రతి విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండానే నా వర్క్ పూర్తి అయ్యిందని సాయి మాధవ్ బుర్ర అన్నాడు. ప్రతి ఒక్కరి పని చాలా ఈజీగా అయ్యేలా రాజమౌళి పని ఉంటుందని.. ఆయన ఎంతో క్లారిటీగా అన్ని విషయాల్లో కూడా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా తమ పనిని ఈజీగా చేసేస్తారని చెప్పుకొచ్చాడు.

ఇక ఆర్ ఆర్ ఆర్ లో హీరోల పాత్రలను గురించి సాయి మాధవ్ మాట్లాడుతూ.. రెండు సింహాలు హోరా హోరీ గా పోరాటం చేస్తున్నట్లుగా సినిమా ఉంటుంది. ఇద్దరికి కూడా సమానమైన స్క్రీన్ స్పేస్ ఉంటుందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు. రెండు పాత్రలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత సినిమా లో ఇద్దరు హీరోల రేంజ్ ను చూపిస్తుంది. రాజమౌళి సెట్ లో ప్రతి ఒక్కరి పనిని చాలా ఈజీగా మార్చేస్తారు. ఆయన ప్రతి విషయంలో కూడా చాలా డెప్త్ గా ఆలోచించడంతో పాటు అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ ను జరుపుతున్నారు. రికార్డు స్థాయిలో సినిమాను పలు భాషల్లో పలు దేశాల్లో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1940 బ్యాక్ డ్రాప్ తో అల్లూరి మరియు కొమురం భీమ్ల పాత్రలను తీసుకుని కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.