మాదక ద్రవ్యాల కొనుగోలులో రియా కోడ్ లాంగ్వేజ్?

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రోజుకో మలుపు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ నేపథ్యంలో మాదక ద్రవ్యాల కొనుగోళ్లు డ్రగ్ దందాపై విచారణ సాగిస్తున్నారు. ఇక ఈ కేసు విషయమై రియాకు వ్యతిరేకంగా లోకం అంతా ప్రూఫ్ లు చూపించే ప్రయత్నం చేస్తోంది. సుశాంత్ సింగ్ కుటుంబీకుల్లో అతడి సోదరి కీర్తి సింగ్ అయితే రియాపై ఏకుమేకై ఫైరైపోతోంది. రియా చక్రవర్తి ఆగడాలపై అంతెత్తున ఎగిరి పడుతోంది కీర్తి సింగ్. ముఖ్యంగా […]

అర్థరాత్రి పోలీసులకు రియా ఫిర్యాదు?

సుశాంత్ కేసులో రియాను ఇప్పటికే ముంబయి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పుడు కేసు సీబీఐ వారి వద్దకు వెళ్లడంతో వారు మళ్లీ ఫ్రెష్ గా ఎంక్వౌరీ షురూ చేశారు. పోలీసులు ప్రశ్నించిన వారందరిని కూడా మళ్లీ మళ్లీ సీబీఐ వారు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. అన్నట్లుగానే సుశాంత్ పని మనుషి మాజీ మేనేజర్ రియాను ఇంకా ఆమె సోదరుడిని కూడా విచారిస్తున్నారు. నిన్న రియాను సీబీఐ వారు మొదటి రోజు విచారించారు. నిన్న రియాను దాదాపుగా 9 […]

ఈసారి రియాకు అనుకూలంగా ట్రెండ్స్

సుశాంత్ మృతి కేసులో ప్రధాన ముద్దాయిగా మారిన రియాను టార్గెట్ చేసి నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమెను విమర్శిస్తూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసి దాన్ని జాతీయ స్థాయిలో ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన ఘనత సుశాంత్ అభిమానులకు ఉంది. ఈమద్య కాలంలో ట్విట్టర్ లో రెగ్యులర్ గా సుశాంత్ విషయంలో రియా పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమెపై నెగటివ్ కామెంట్స్ మరియు బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తనను […]

సుశాంత్ కేసులో రియాకు లాయర్ ఉచిత సేవలు..!?

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో ట్విస్టులు మలుపుల గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రియా చక్రవర్తి లాయర్ సతీష్ మనేషిందే పేరు హైలైట్ అవ్వడం చర్చకు వచ్చింది. ఆయన రియాకు ఉచిత సేవలందిస్తున్నారనేది నెటిజనుల అభియోగం. అయితే అదంతా ఉత్తుత్తే.. అంటూ.. న్యాయవాది సతీష్ మనేషిందే ఖండించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని .. నా క్లైయింట్ ఫీజు ఇస్తుందా లేదా? అన్నది మా వ్యక్తిగతం అని అన్నారు. అలాగే ఈ కేసులో తన తరపున వాదించేందుకు […]

రియా అదుపు తప్పిన ప్రవర్తనకు హడలెత్తారు!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రకరకాల అంశాలు రియాను ఆమె కుటుంబీకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తనని తాను డిపెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ కేసు విచారణ పూర్తిగా తేలకముందే రియాను దోషి అన్నట్టుగా మీడియా చానెళ్లు కథనాలు వెలువరించడంపై ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు. రియా అయితే మీడియా కనిపిస్తే నమిలేయాలన్నంత కోపంగా చూస్తోంది. నేటి ఉదయం నుంచి రియాపై సీబీఐ […]

ఆరోజే సుశాంత్ నెంబర్ బ్లాక్ చేశా : రియా

సుశాంత్ మరణం తర్వాత తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించేందుకు ఒక జాతీయ మీడియా సంస్థకు రియా చక్రవర్తి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెళ్లడి చేసింది. సుశాంత్ ఉన్న సమస్యల నుండి మొదలుకుని ఆయన గంజాయి తాగుతాడు అనే వరకు అన్ని విషయాల గురించి పేర్కొంది. జూన్ 8వ తారీకున ఏం జరిగింది.. అసలు ఆ రోజున ఎందుకు సుశాంత్ ఇంటి నుండి రియా వెళ్లి పోయింది అనే విషయమై రియా […]

సుశాంత్ ని పెళ్లాడాలనుకున్నారా? .. రియాకు సీబీఐ ప్రశ్న

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక కారణాలపై సీబీఐ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు నేడు ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలుస్తోంది. ముంబై డీఆర్.డీఓ అతిథి గృహంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు. అసలు సుశాంత్ తో పరిచయం.. ప్రేమ.. బ్యాంక్ ఖాతాల లావాదేవీలు .. అతడి ఖాతా నుంచి ఎవరి ఖాతాలకు […]

మమ్ముల బతకనివ్వరా అంటున్న రియా

సుశాంత్ మృతి చెందినప్పటి నుండి కూడా రియా చక్రవర్తిని మీడియా వారు కలిసేందుకు మాట్లాడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆమె బయటకు వెళ్లినా లేదా ఆమె కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినా కూడా మీడియా వారు వారిని చుట్టుముట్టి ఏదో ఒక సమాధానం రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రియా చక్రవర్తి ఈ వీడియోను షేర్ చేసి తన ఇంటి ముందు మీడియా వారు చేస్తున్న హడావుడి ఇది అంటూ అసహనం వ్యక్తం చేసింది. తన తండ్రి […]

# సుశాంత్ మిస్టరీ.. రియా ప్రమాదకర డ్రగ్స్ ప్రయోగించిందా?

సుశాంత్ బలవన్మరణం కేసులో చిక్కుముడులు వీడడం లేదు. ప్రేయసి రియా చక్రవర్తి మెడకు అంతకంతకు ఉచ్చు బిగుసుకుంటూనే ఉంది. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఒక్కో చిక్కుముడి విప్పే పనిలో ఉంది. ఇక ఇందులో మరో కొత్త ట్విస్టు అగ్గి రాజేస్తోంది. అదే రియాకు డ్రగ్ డీలర్లతో సత్సంబంధాలు… డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లు హీట్ పెంచేస్తున్నాయి. నిషేధిత మాదక ద్రవ్యాల్ని రియా చక్రవర్తి కొనుగోలు చేసేదన్న నిజం నిగ్గు తేలింది. […]

రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా…?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ మరియు ఈడీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుశాంత్ మరణంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఇక ఈ కేసు విషయంలో ముంబైలో సీబీఐ మరియు ఈడీ అధికారులు భేటీ అయ్యారని సమాచారం. సీబీఐ ఇప్పటికే సుశాంత్ సింగ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని.. వంట మనిషి నీరజ్ సింగ్.. […]

సుశాంత్ హత్యకు రియా `ఇద్దరు డాడీ`ల స్కెచ్?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. సుశాంత్ కేసుకు సంబంధించి అనుమానమున్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న సీబీఐ అధికారులు….సుశాంత్ కేసులో అనుమానితులందరినీ విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న రియా చక్రవర్తితో పాటు పలువురి పై సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. మరో వైపు రియా చక్రవర్తికి ప్రముఖ నిర్మాత మహేష్ […]

రియాపై రిపబ్లిక్ టీవీ మరో సంచలన కథనం

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత రిపబ్లిక్ టీవీలో బాలీవుడ్ పై వరుసగా కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం మరియు డ్రగ్స్ పబ్స్ కల్చర్ గురించి కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్ టీవీలో చర్చ కార్యక్రమం కూడా నిర్వహించారు. సుశాంత్ మరణంకు బాలీవుడ్ లోని కొందరు కారణం అయ్యి ఉంటారు అంటూ మొదటి నుండి కూడా రిపబ్లిక్ టీవీ కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. అందులో భాగంగా కొన్ని ఇన్వెస్టిగేషన్ వీడియోలను కూడా టెలికాస్ట్ […]

సుశాంత్ కేసు: వైరల్ అవుతున్న రియా – మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు దర్శకనిర్మాత మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకి వచ్చింది. […]

డబ్బులే లేవన్న రియా అంత లాయర్ ఫీజ్ ఎలా చెల్లిస్తుంది

సుశాంత్ ఇష్యూలో కంగనా రనౌత్ మొదటి నుండి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులకు సంబంధం ఉందంటూ ఆమె బలంగా వాదిస్తూ వస్తుంది. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆరోపించింది. సుశాంత్ చనిపోయినప్పటి నుండి ఆమె సోషల్ మీడియాలో మరియు జాతీయ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా ఆమె రియా చక్రవర్తిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పటి […]