Templates by BIGtheme NET
Home >> Telugu News >> జగన్ సర్కార్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జగన్ సర్కార్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్ సర్కార్పై మరోసారి ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతలుపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది.

ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈసీ వినతులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. తాము తొలగించిన వ్యక్తి తిరిగి సీఈసీగా రావడంతో.. ప్రభుత్వం నాన్ కో ఆపరేటివ్గా వ్యవహరిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు మారుతాయి.. రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని.. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.

ఈసీకి సంబంధించి మూడు రోజుల్లో ప్రభుత్వానికి సవివర వినతిపత్రం ఇవ్వాలని.. ప్రభుత్వం నివేదికను 15 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

అలాగే మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనగరాజ్ తన పదవికి సంబంధించి అడ్వొకేట్ నియమించుకుంటే.. సొంత చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. ఆయన ఇంటి కోసం రూ.20 లక్షలు ఫర్నిచర్కు రూ.15 లక్షల అంశంపై ఈసీ మరోసారి పరిశీలించాలని సూచించింది. అలాగే కనగరాజ్ లాయర్ ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని.. ఇదంతా ప్రజల సొమ్మేనని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.