‘కింగ్’ నాగ్ సినిమాపై అలియా ఎఫెక్ట్ పడనుందా…?

0

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే స్థాయిలో అమ్మడి చుట్టూ నెగిటివిటీ కూడా వచ్చి చేరింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత విమర్శలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ మరియు అతని తనయ అలియా భట్ లపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. లేటెస్టుగా విడుదలైన ‘సడక్ 2’ సినిమానే దీనికి ఉదాహరణ. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన డిస్ లైక్స్ చూస్తే వారిపై ఏ రేంజ్ లో నెగిటివిటీ ఉందో అర్థం అవుతుంది. ప్రపంచంలో వరస్ట్ ట్రైలర్ అనే రికార్డ్ క్రియేట్ చేయడంతో పాటు.. ‘సడక్ 2’ మూవీ ఐఎండీబీలో 1 రేటింగ్ పాయింట్ సాధించి చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది. అయితే ఆలియా భట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనా దీని ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుశాంత్ కేసు ఒక కొలిక్కి వచ్చే దాకా నెపోటిజంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో దీంతో అలియాతో ఒప్పందాలు కుదుర్చుకున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు డైలమాలో పడ్డారని తెలుస్తోంది.

కాగా బాలీవుడ్ నెపోటిజంతో అట్టడుకిపోతున్న ఈ టైమ్ లో అలియా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా పరిస్థితి ఏంటన్నదే పెద్ద డౌట్ గా మారిందని బాంబే వర్గాలు చెబుతున్నాయి. రణబీర్ కపూర్ – అమితాబ్ బచ్చన్ – ‘కింగ్’ నాగార్జున – మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో నాగార్జున ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారని తెలుస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే మిగతా షూటింగ్ ఎక్కువ భాగం అలియాపై షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ షెడ్యూల్ లో పాల్గొనే పరిస్థితి లేదని.. మరి కొన్నాళ్లపాటు ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ జరిగే అవకాశం లేదని బీ-టౌన్ లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ‘సడఖ్ 2’ మూవీపై బాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి బ్యాడ్ రెస్పాన్స్ రావడంతో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విషయంలో కూడా పెద్ద ఎత్తున నెగిటిల్ కామెంట్స్ డిజ్ లైక్స్ వస్తాయనే టెన్షన్ లో చిత్ర సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద చాలా ఏళ్ళకి నాగార్జున హిందీలో నటిస్తున్న ఈ సినిమాకి అలియా రూపంలో నెగెటివిటీ వచ్చి చేరుతుందని టాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు.