చిరు – మణి కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందా…?

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొరటాల శివ స్టైల్ లో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లోనూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో చిరుకి జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించారు.

ఇదిలా ఉండగా ‘ఆచార్య’ సినిమాతో 14 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – సంగీత బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మణిశర్మ ‘ఆచార్య’ కోసం ఎలాంటి మ్యూజిక్ అందించబోతున్నారో అని మెగా ఫ్యాన్స్ మరియు మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చిరు – మణి కాంబోలో వచ్చిన సినిమాల రిజల్ట్ ఎలా సంగీతం పరంగా బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘బావగారు బాగున్నారా?’ ‘చూడాలని ఉంది’ ‘మృగరాజు’ ‘ఇద్దరు మిత్రులు’ ‘అన్నయ్య’ ‘అంజి’ ‘ఇంద్ర’ ‘ఠాగూర్’ ‘జై చిరంజీవా’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలు వచ్చాయి. చిరు పుట్టినరోజు నాడు రాబోయే మోషన్ పోస్టర్ కి మణిశర్మ ఇచ్చిన బీజీఎమ్ ని బట్టి ‘ఆచార్య’కి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడో ఓ అంచనాకి రావొచ్చని మెగా అభిమానులు భావిస్తున్నారు.