తాప్సీ ని పట్టి పీడిస్తున్న చిరకాల కోరిక…!

0

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మందినాధం’ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయింది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ తాప్సీ తన అందాలతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘గుండెల్లో గోదారి’ ‘సాహసం’ ‘ఘాజీ’ ‘ఆనందో బ్రహ్మ’ ‘నీవెవరో’ ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే పదేళ్ల సినీ కెరీర్లో ఒక్క సోలో బ్లాక్ బస్టర్ అందుకోలేదనే చెప్పాలి. అయితే బాలీవుడ్ లో మాత్రం మంచి విజయాలు అందుకుంది. ‘చష్మే బద్దూర్’ ‘పింక్’ ‘నామ్ సభానా’ ‘బేబీ’ ‘రన్నింగ్ షాదీ’ ‘సూర్మా’ ‘ముల్క్’ ‘బద్లా’ మిషన్ మంగళ్’ ‘సాండ్ కీ ఆంఖ్’ ‘తప్పడ్’ చిత్రాలు ఆమెని బాలీవుడ్ లో నిలబెట్టాయి. అయితే టాలీవుడ్ లో హిట్ కొట్టలేకపోయాననే కోరిక మాత్రం చిరకాల కోరికగానే మిగిలిపోయింది.

కాగా తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా ‘తప్పడ్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎప్పటి నుంచో సౌత్ లో హిట్ కొట్టాలని చూస్తున్న తాప్సీ.. ‘తప్పడ్’ తెలుగు రీమేక్ లో నటించే ఛాన్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తోందట. బాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకున్న తాప్సీ.. పలు ఇంటర్వ్యూలలో హిందీలో ఎన్ని చిత్రాల్లో నటించినా తెలుగు తమిళ చిత్రాలను మాత్రం వదులుకోనని వెల్లడించింది. ఎందుకంటే తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది దక్షిణాది సినిమానేనని.. ఎంత బిజీగా ఉన్నా తమిళ్ తెలుగు భాషల్లో ఛాన్సెస్ వస్తే కచ్చితంగా నటిస్తానని.. అందుకు ఎన్ని కాల్ షీట్స్ కావాలన్నా కేటాయిస్తానని చెప్పుకొచ్చింది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే అమ్మడికి టాలీవుడ్ లో మాత్రం ఆఫర్స్ రావడం లేదు. మరి ‘తప్పడ్’ తెలుగు రీమేక్ లో నటించి హిట్ అందుకుంటుందేమో చూడాలి.