మాల్దీవుల్లో ఫోటోషూట్.. కత్రినకు కరోనా టెస్ట్

0

వరుసగా స్టార్లు అంతా షూటింగులకు వెళుతున్నారు. వెళ్లే ముందే చెక్ పాయింట్ లో కరోనా టెస్ట్ మస్ట్ అయ్యింది. అగ్ర తారలంతా ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు అందాల కత్రిన వంతు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ షూట్ ప్రారంభించే ముందు కరోనావైరస్ పరీక్ష చేయించుకుంది. ఆమె ఇదిగో ఇలా చిరునవ్వు చిందించింది టెస్ట్ కోసం మ్యూకస్ ని తీసుకునే క్రమంలో ఫన్ బయటపడింది.

కత్రినా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోను ఎంతో ఫన్ ని జనరేట్ చేస్తోంది. కత్రిన అందమైన తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కనిపిస్తోంది. కనిష్ట మేకప్ తో తన రూపాన్ని ఎల్లప్పుడూ చిరునవ్వుని మెయింటెయిన్ చేయడం తన స్టైల్. కత్రినా ఇటీవల మాల్దీవుల్లో విహారంలో ఉంది. ఆమె ఫోటోషూట్ కోసం అక్కడికి చేరుకుంది.

కత్రిన తదుపరి రోహిత్ శెట్టి కాప్ యాక్షన్ డ్రామా `సూర్యవంశీ`లో నటించనుంది. అక్షయ్ కుమార్ హీరో. అలాగే సిద్ధాంత్ చతుర్వేది ఇషాన్ ఖత్తర్ లతో కలిసి హారర్ కామెడీ ఫోన్ భూత్ లో కనిపిస్తుంది.