పవన్ కు మరో గెస్ట్ హీరోయిన్ కావాలి

0

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవ ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పింక్ లో హీరోకు జోడీ ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం శృతి హాసన్ ను గెస్ట్ హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన తర్వాత చివరకు వకీల్ సాబ్ కోసం హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ నటించబోతున్న మలయాళి మూవీ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో హీరోయిన్ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

అయ్యప్పన్ కోషియమ్ లో హీరోయిన్ పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. తెలుగు రీమేక్ లో హీరోయిన్ పాత్రను కాస్త పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో భాగంగా హీరో హీరోయిన్ మద్య పాటలు మరియు రొమాంటిక్ సన్నివేశాలను కూడా చొప్పించబోతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రకు గాను సాయి పల్లవిని సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని అంటున్నారు.

సాయి పల్లవి కాకుంటే మరెవ్వరు ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి పవన్ కు జోడీగా కనిపించబోతున్న ఆ గెస్ట్ హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను కేవలం నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా హీరోయిన్ డేట్లు కూడా తీసుకోబోతున్నారు.