బాబాయ్ బాలయ్య కోసం అబ్బాయి రెడీ

0

నందమూరి ఫ్యామిలీలో మరో కాంబోకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రతిసారి తన సినిమాలో ఎవరినో ఒకరిని ఎంట్రీ చేసి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తారు. గతంలో పాత హీరో జగపతిబాబును విలన్ ను చేసి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ ను చేశారు. ఇప్పుడు తాజాగా బోయపాటి స్టార్ హీరో బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.

బాలయ్య-బోయపాటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర రూమర్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

బాలయ్య చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ ను ఓ గెస్ట్ రోల్ లో బోయపాటి చూపించబోతున్నాడని టాక్. కళ్యాణ్ రామ్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తుందని.. పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

బాలయ్య సినిమాలో ఇప్పటికే ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాడు. మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోపై ఫ్యాన్స్ లో భారీ ఆశలు ఉన్నాయి.