ఆ స్టార్ హీరోలంతా డ్రగ్ బానిసలే.. కంగనా సంచలన వ్యాఖ్యలు

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై లెక్కలేనన్ని ఆరోపణలు వాగ్వాదాలు చేసిన కంగనారనౌత్.. ఇప్పుడు మరోసారి కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశిక్ డ్రగ్ కు బానిసలయ్యారనే ఆరోపణలు ఉన్నాయని వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిని ఆరాధించే లక్షలాది అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ట్విట్టర్ ద్వారా కోరింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా బాలీవుడ్ నటులను వరుసబెట్టి ఏకిపారేసింది. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన సుశాంత్ ని అందరూ కలసి దూరం చేశారని బాలీవుడ్ పెద్దల నెపోటిజమే అతడి మరణానికి కారణం అని ట్విట్టర్ వేదిక రోజుల కొద్దీ ఈ వార్ సాగించింది. అయితే సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కి అతడు హత్యకు గురైనట్లు ఒక్క ఆధారం కూడా దొరకలేదు.

తన ఆరోపణలు ఫెయిల్ అయిన నేపథ్యంలో కంగనా మరో వివాదంపై దృష్టి సారించింది. రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశిక్ కొకైన్ డ్రగ్ కు బానిసలయ్యారనే ఆరోపణలు వస్తున్నాయని వారు తమ రక్త నమూనాలు ఇచ్చి డ్రగ్ పరీక్ష చేయించుకోవాలని కోరింది. మిమ్మల్ని అభిమానించే లక్షలాది అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ట్వీట్ చేసింది. కంగనా అంతటితో ఆగకుండా తన ట్వీట్ ని ప్రధాని మోదీకి ట్యాగ్ కూడా చేసింది. కంగనా ప్రముఖ నటులపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కాగా సుశాంత్ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు తాజాగా అతడి చెల్లెళ్ళను విచారించారు. ‘మా అన్నయ్య కొన్ని నెల నుంచి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై గత ఏడాది ఓ సైక్రియాటిస్ట్ ను కూడా సుశాంత్ కలవడం జరిగిందని ‘ వారు వెల్లడించారు.